టాలీవుడ్లో బెస్ట్ కపుల్స్ అంటే... ప్రిన్స్ మహేష్ బాబు.. ఆయన సతీమణి నమ్రత పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. భార్య ఎలా ఉండాలి? భర్త పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దానికి నమ్రత సరైనా సమాధానంగా నిలుస్తారు. ప్రతీ విషయంలో భర్తకు చేదోడువాదోడుగా నిలుస్తూ... అటు పిల్లల్ని వారి భవిష్యత్తును కూడా సమర్థవంతంగా నమ్రత తీర్చిదిద్దుతున్నారనడంలో ఎక్కడా ఎలాంటి సందేహం లేదు. ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో మహేష్ కూడా ఒప్పుకున్నారు. తనకు సంబంధించిన విషయాలన్నీ నమ్రతానే స్వయంగా చూసుకుంటుందని చెప్పారు మహేష్. అయితే తన భార్యపై తనకున్న ప్రేమను కూడా అనేక సందర్భాల్లో చాటుకున్నారు టాలీవుడ్ రాజకుమారుడు. కొన్నాళ్ల వరకు చాలా ప్రైవసీ మెంటైన్ చేసిన మహేష్... ఈ మధ్యకాలంలో మాత్రం చాలా మారిపోయాడు. తన కుటుంబానికి సంబంధించిన ప్రతీ చిన్న విషయాన్ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన అభిమానులతో పంచుకుంటున్నారు. ఇక మహేష్ చెప్పేది ఏ చిన్న వార్త అయినా సరే... అతని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. అయితే తాజాగా ... మహేష్.. తన భార్య నమ్రతతో దిగిన ఓ ఫోటోను ట్విట్టర్లో షేర్ చేశాడు. ఆ ఫోటోలో నమ్రత మమేష్ను వెనుక నుంచి గట్టిగా హత్తుకొని కనిపిస్తుంటే... మహేష్ మొహంలో నవ్వులే నవ్వులు. దీనికి ఓ క్యాప్షన్ కూడా పెట్టాడు. అయితే విషయం ఏంటంటే ఇవాళ మహేష్ నమ్రతల పెళ్లి రోజు. అందుకే... ‘హ్యాపీ 15 మై లవ్... ప్రతీ రోజు కొంచెం ఎక్కువగానే నిన్ను ప్రేమిస్తుంటా’అంటూ ట్వీట్ చేశాడు.
Happy 15 my love!! ❤ Love you a little more each day 🤗 #Namrata💕 pic.twitter.com/Bih2VrwdDF
— Mahesh Babu (@urstrulyMahesh) February 10, 2020
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mahesh babu, Mahesh Babu Latest News, Tollywood, Tollywood Movie News, Tollywood news