అప్పటివరకు ఉండలేను... కూతురిపై మహేష్‌బాబు ఎమోషనల్ ట్వీట్

క్వీన్ ఎల్సా చిన్ననాటి పాత్రకు టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు కుమార్తె సితార వాయిస్ ఇచ్చింది.

news18-telugu
Updated: November 20, 2019, 12:17 PM IST
అప్పటివరకు ఉండలేను... కూతురిపై మహేష్‌బాబు ఎమోషనల్ ట్వీట్
కూతురు సితారతో మహేష్ బాబు
  • Share this:
మహేష్ బాబుకు పిల్లలంటే ప్రాణం. అందుకే ఏ కాస్త టైం దొరికినా కొడుకు గౌతమ్, కూతురు సితారతోనే ఎక్కువ సమయం గడుపుతుంటాడు. ఫ్యామిలీని తీసుకొని అందమైన ప్రదేశాలకు చెక్కేస్తుంటాడు. ఇక కూతురుతో ఏ తండ్రికైనా అనుబంధం ఎంతో స్పెషల్‌గా ఉంటుంది. మహేష్‌కు కూడా కూతురు సీతార అంటే చాలా ఇష్టం. అందుకే ఎప్పటికప్పుడు నా సీతూ పాపా అంటూ సోషల్ మీడియాలో తన గారాలపట్టిపై మెసేజులు పెడుతుంటాడు మహేష్.

అయితే తాజాగా సితారా ఓ గొప్ప చిత్రానికి డబ్బింగ్ చెప్పింది. ఈ వారంలో ప్రపంచవ్యాప్తంగా వెండితెరలను తాకనున్న 'ఫ్రోజన్-2' చిత్రంలో క్వీన్ ఎల్సా చిన్ననాటి పాత్రకు టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు కుమార్తె సితార వాయిస్ ఇచ్చింది. డిస్నీ స్టూడియో ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇక తన కుమార్తె గొంతును తొలిసారిగా వెండితెరపై వినేందుకు మహేష్ చాలా ఆసక్తి చూపిస్తున్నాడు. సినిమా రిలీజ్ వరకు ఆగలేకుండా ఉన్నానని మహేశ్, తన ట్విట్టర్‌లో పోస్టు పెట్టాడు. ‘ఆమె నిజంగా క్వీన్ ఎల్సాకు మినీ వర్షన్. ఎంతో నమ్మకంగా, మ్యాజికల్ గా, స్వచ్ఛంగా ఉంది. సీతూ పాపను చూస్తుంటే గర్వంగా ఉంది. నవంబర్ 22 వరకూ ఆగలేను" అని ట్వీట్ చేశారు.మరి మహేష్‌తో పాటు.. ఆయన ఫ్యాన్స్ సైతం సితారా గొంతును సిల్వర్ స్క్రీన్‌పై వినేందుకు చాలా ఇంట్రస్టింగ్‌గా ఎదురుచూస్తున్నారు.
Published by: Sulthana Begum Shaik
First published: November 20, 2019, 12:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading