హోమ్ /వార్తలు /సినిమా /

రజినీకాంత్ చిత్రంలో గోపీచంద్.. ఇంతకీ ఏ పాత్రలో అంటే..

రజినీకాంత్ చిత్రంలో గోపీచంద్.. ఇంతకీ ఏ పాత్రలో అంటే..

రజినీకాంత్,గోపీచంద్ (Twitter/Photo)

రజినీకాంత్,గోపీచంద్ (Twitter/Photo)

Rajinikanth Gopichand | సూపర్ స్టార్‌ రజినీకాంత్ చిత్రంలో గోపీచంద్ నటిస్తున్నాడా అంటే ఔననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు.

సూపర్ స్టార్‌ రజినీకాంత్ చిత్రంలో గోపీచంద్ నటిస్తున్నాడా అంటే ఔననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం రజినీకాంత్.. శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా.  ఈ చిత్రంలో రజినీ సరసన ఒకప్పటి కథానాయికలు ‘ఖుష్బూ, మీనా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. కీర్తి సురేష్ ఈ చిత్రంలో రజినీకాంత్ కూతురు పాత్రలో నటిస్తోంది. తాజాగా ఈ చిత్రంలో ఒక ఇంపార్టెంట్ రోల్లో గోపీచంద్ యాక్ట్ చేయబోతున్నట్టు సమాచారం. ఇక శివ కూడా గోపీచంద్‌తో గతంలో ‘శౌర్యం’, శంఖం  వంటి సినిమాలను తెరకెక్కించాడు. ఆ చనువుతోనే ఈ సినిమాలో గోపీచంద్‌ కోసం ఓ ముఖ్యపాత్ర చేయమని కోరినట్టు సమాచారం. ఇక గోపీచంద్ కూడా రజినీకాంత్ చిత్రంలో పాత్ర అనగానే ఓకే చెప్పినట్టు సమాచారం. రజినీకాంత్‌తో తెరకెక్కించబోయే ఈ చిత్రానికి ‘అన్నతే’ అనే టైటిల్ కన్ఫామ్ చేసారు. తెలుగులో ఈ చిత్రానికి ‘అన్నయ్య’ పేరు పరిశీలిస్తున్నారు. టైటిల్ బట్టి చూస్తుంటే.. ఈ చిత్రంలో గోపీచంద్ రజినీకాంత్ తమ్ముడి పాత్రలో నటిస్తున్నాడా ? లేకపోతే మెయిన్ విలన్‌గా యాక్ట్ చేయబోతున్నాడా అనేది చూడాలి. గతంలో గోపీచంద్..‘జయం’ తమిళ రీమేక్‌లో విలన్‌గా నటించాడు. ఆ తర్వాత మరే తమిళ సినిమాలో నటించలేదు. ప్రస్తుతం గోపీచంద్.. సంపత్ నంది దర్శకత్వంలో ‘సీటీమార్’ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోంది.

First published:

Tags: Gopichand, Kollywood, Kushboo, Meena, Rajinikanth, Tollywood

ఉత్తమ కథలు