వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ హీరో హీరోయిన్లుగా రూపొందనున్న చిత్రం ఎఫ్ 3. గత ఏడాది సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద సందడి చేసి భారీ విజయాన్ని దక్కించుకున్న ‘ఎఫ్ 2’ చిత్రానికి ఇది సీక్వెల్‌గా రూపొందనుంది. అనీల్ రావిపూడి దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తోన్న చిత్రమిది. వెంకటేశ్ పుట్టినరోజు ఈ సినిమాను అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘ఎఫ్2’ భార్యల మనస్తత్వం వల్ల కుటుంబంలో గొడవలు జరిగితే, ‘ఎఫ్ 3’లో డబ్బు వల్ల కుటుంబాల్లో ఎలాంటి మార్పులు జరిగాయనేది కథ అని అంటున్నారు. కాన్సెప్ట్ పోస్టర్లోనూ ఈ విషయాన్ని ఇన్ డైరెక్ట్‌గా చెప్పారు. వెంకటేశ్ ప్రస్తుతం నారప్ప షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే.. ఎఫ్3 చిత్రీకరణలో పాల్గొంటాడు.
ఎఫ్ 2లో ఇద్దరు హీరోలు, ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. కానీ ‘ఎఫ్ 3’లో మరో హీరో కూడా యాడ్ అవుతాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ హీరో ఎవరనే దానిపై కొన్ని రోజుల ముందే చాలా వార్తలు వినిపించాయి. మహేశ్, రవితేజ వంటి స్టార్ నటించే అవకాశం ఉందని కూడా అన్నారు. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం, ఇప్పుడు మరో హీరో పేరు ఈ సీక్వెల్ కోసం వినిపిస్తోంది. ఆ హీరో ఎవరో కాదు.. టాలీవుడ్ హల్క్ గోపీచంద్. ఈ హీరో పాత్రను కూడా చాలా హ్యుమర్ టచ్‌తో డిజైన్ చేశాడట అనీల్ రావిపూడి. అయితే ఈ పాత్ర పరిధి ఏ మేకు ఉంటుంది.. అసలు ఉంటుందా? లేదా అనేది తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.
ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరుతో భారీ హిట్‌ను దక్కించుకున్న దర్శకుడు అనీల్ రావిపూడి.. వెంటనే సినిమాను స్టార్ట్ చేయలేకపోయాడు. మధ్యలో ఇతర హీరోలతో అనీల్ రావిపూడి సినిమా ఉంటుందని వార్తలు వినిపించాయి కూడా. అదే సమయంలో ఎఫ్ 2 సీక్వెల్‌గా ఎఫ్ 3 ఉంటుందని కూడా వార్తలు వచ్చాయి. కానీ ఎఫ్ 3 తెరకెక్కడానికి సమయం పడుతుందని టాక్ వినిపించింది. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఎఫ్ 3నే ముందుగా సెట్స్‌పైకి వెళుతుంది.
Published by:Anil
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.