టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ హీరో కన్నుమూత..

Yadakrishna Passes Away | 2020 సినీ పరిశ్రమకు అంతగా కలిసిరాలేదనే చెప్పాలి. తాజాగా టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ హీరో, నిర్మాత గుండెపోటుతో మృతి చెందారు.

news18-telugu
Updated: December 2, 2020, 7:27 PM IST
టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ హీరో కన్నుమూత..
ప్రముఖ హీరో కమ్ నిర్మాత యాదాకృష్ణ మృతి (File/Photo)
  • Share this:
Yadakrishna Passes Away | 2020 సినీ పరిశ్రమకు అంతగా కలిసిరాలేదనే చెప్పాలి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, రిషీ కపూర్, ఇర్ఫాన్ ఖాన్ వంటి ఎంతో మంది నటులు ఈ యేడాది ఈ లోకాన్ని విడిచివెళ్లారు. ఇందులో కొందరు కరోనా కారణంగా కన్నుమూస్తే..ఇంకొందరు ధీర్ధ కాలిక వ్యాధులతో కన్నుమూయడం విషాదకరం.తాజాగా టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. తెలుగులో ‘గుప్త శాస్త్రం, ‘పిక్నిక్, ‘సంక్రాంతి అల్లుడు’ వంటి పలు బీ గ్రేడ్ చిత్రాల్లో హీరోగా నటించిన యాదాకృష్ణ గుండెపోటుతో కన్నుమూసారు. ఆయన వయసు 61 సంవత్సరాలు. ఈయన హీరోగా నటించిన అన్ని సినిమాలను ఆయనే నిర్మాతగా వ్యవహరించడం విశేషం. తాను హీరోగా నటించిన సినిమాలతో పాటు పలు చిత్రాలను నిర్మించారు. 2010లో వచ్చిన ‘సంక్రాంతి అల్లుడు’ సినిమాలో చివరి సారిగా తెరపై కనిపించారు. కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ తన వ్యాపారాలేవో చూసుకుంటున్నాడు. అంతేకాదు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ వ్యవహారాల్లో కూడా కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఆయన ఆకస్మిక మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఈయన ఎక్కువగా బీ గ్రేడ్ సినిమాలతోనే పాపులర్ అయ్యారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: December 2, 2020, 7:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading