వై.యస్. జగన్మోహన్ రెడ్డి గెలుపుతో వెనక్కి తగ్గిన నందమూరి బాలకృష్ణ..

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వై.యస్.జగన్మోహన్ రెడ్డికి చెందిన వైయస్ఆర్‌సీపీ 175 సీట్లకు గాను 151 సీట్ల బంపర్ మెజారిటీతో గెలిచింది. దీంతో జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నాడు. ఇక వై.యస్.జగన్ ముఖ్యమంత్రి కావడంతో ఆ ఎఫెక్ట్ బాలకృష్ణ నెక్ట్స్ ప్రాజెక్ట్ పై పడింది. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: May 30, 2019, 10:18 AM IST
వై.యస్. జగన్మోహన్ రెడ్డి గెలుపుతో వెనక్కి తగ్గిన నందమూరి బాలకృష్ణ..
బాలయ్య వైఎస్ జగన్
  • Share this:
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వై.యస్.జగన్మోహన్ రెడ్డికి చెందిన వైయస్ఆర్‌సీపీ 175 సీట్లకు గాను 151 సీట్ల బంపర్ మెజారిటీతో గెలిచింది. దీంతో జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నాడు. ఇక వై.యస్.జగన్ ముఖ్యమంత్రి కావడంతో ఆ ఎఫెక్ట్ బాలకృష్ణ నెక్ట్స్ ప్రాజెక్ట్ పై పడింది. వివరాల్లోకి వెళితే.. ఎన్టీఆర్ జీవిత చరిత్రపై తీసిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’,‘ఎన్టీఆర్ మహానాయకుడు’ దారుణంగా డిజాస్టర్స్ కావడంతో బాలయ్య..తన నెక్ట్స్ సినిమాను బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయడానికి రెడీ అయ్యాడు. ఎన్టీఆర్ బయోపిక్ ఫ్లాప్ ఎఫెక్ట్‌తో బాలయ్య, బోయపాటి శ్రీనుతో చేయబోయే సినిమాలో కొన్ని మార్పులు చేర్పులు చేయమన్నాడు. దీనికి ఎంత లేదన్నా మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉండటంతో బాలయ్య వెంటనే తనకు జై సింహా వంటి ఓ మోస్తరు సినిమాను అందించిన కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో నెక్ట్స్ సినిమాను చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ తీరా ఎన్నికల్లో వై.యస్.జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంతో ఈసినిమా ఆగిపోయినట్టు సమాచారం.

Actor Cum Politician Nandamuri Balakrishna Stops k.s.ravi kumar movie due to Y.S.Jagan mohan Reddy comes to power in AP Assembly Elections,balakrishna,balakrishna stops ks ravikumar movie,ys jagan mohan reddy comes to power balakrishna stops ks ravi kumar,nandamuri balakrishna,balakrishna facebook,balakrishna instagram,nbk,ys jagan,balakrishna ys jagan mohan reddy,ys jagan mohan reddy,ap cm jagan mohan reddy,ys jagan mohan reddy swearing in as chief minister of ap,ys jagan swearing in ceremony,ap cm ys jagan,oath as ap chief minister,ys jagan swearing in ceremony as new ap cm,jagan mohan reddy,ys jagan mohan reddy as ap new cm,ys jagan is chief minister of ap,ys jagan's swearing in ceremony,ap chief minister,tollywood,telugu cinema,బాలకృష్ణ,బాలయ్య,ఎన్బీకే,నందమూరి బాలకృష్ణ,వైయస్ జగన్మోహన్ రెడ్డి,బాలకృష్ణ బాలయ్య వైయస్ జగన్మోహన్ రెడ్డి,జగన్మోహన్ రెడ్డి గెలవడంతో కే యస్ రవికుమార్ సినిమాను ఆపేసిన బాలయ్య,కే.యస్.రవికుమార్,
బాలకృష్ణ,వై.యస్.జగన్మోహన్ రెడ్డి


ఈ సినిమాలో బాలయ్య రాజకీయ నాయకుడిగా, పోలీస్ ఆఫీసర్‌గా డ్యూయల్ రోల్లో యాక్ట్ చేయనున్నట్టు సమాచారం. మరోవైపు ఈ సినిమాలో జగపతిబాబు కూడా తండ్రి కొడుకులుగా డబుల్ రోల్లో యాక్ట్ చేయబోతున్నట్టు అప్పట్లో లీకులు ఇచ్చారు. ఈ స్టోరీ వై.యస్.రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి పాత్రలను టార్గెట్ చేస్తూ ఈ సినిమాను తెరకెక్కించాలనుకున్నారు. ఇందులో పోలీస్ ఆఫీసర్..అవినీతి పరుడైన రాజకీయ నాయకుడిని వారి కుమారుడిని అరెస్ట్ చేయడం.. రాజకీయ నాయకుడైన మరో బాలకృష్ణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఈ సినిమా కథ ముగుస్తుందని సమాచారం.ఈ సినిమా స్టోరీ ఫక్తు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ ఈ సినిమాను తెరకెక్కించాలనుకున్నా... సరిగ్గా అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా గెలవడంతో ఈ ప్రాజెక్ట్‌ను ఆపేసినట్టు సమాచారం. ఒక వేళ టీడీపీ ఎన్నికల్లో గెలిచుంటే ఈ సినిమాను ఖచ్చితంగా పట్టాలెక్కేది. ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో గెలవడంతో బాలయ్య తాను చేయాలనుకున్న ఈ సినిమాను ఇపుడు ఆపేడం తప్పించి వేరే ఆప్షన్ లేకుండా పోయింది.
First published: May 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading