సినిమా ఇండస్ట్రీలో కులమత బేధాలు అయితే లేవు. ఇక్కడంతా బాగానే ఉంటారు. పండగ ఎవరిదైనా పండగ చేసుకుంటారు అంతే. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. హిందూ ముస్లిం క్రిస్టియన్ భాయీ భాయీ అంటూ సంబరాలు చేసుకుంటారు. తాజాగా క్రిస్మస్ సంబరాలు కూడా అలాగే జరుగుతున్నాయి. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న పెద్ద హీరోలు.. వాళ్ల ఫ్యామిలీస్ అంతా క్రిస్మస్ ఓ రేంజ్లో సెలబ్రేట్ చేసుకున్నారు. వాటికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. అయితే ఇక్కడ ఓ హీరో మాత్రం చాలా భిన్నంగా క్రిస్మస్ జరుపుకున్నాడు. అంతా ఇంట్లో క్రిస్మస్ చేసుకుంటే.. ఆ హీరో మాత్రం ఏకంగా ఒంట్లోనే క్రిస్మస్ నింపుకున్నాడు. అర్థం కాలేదు కదా.. క్రిస్మస్ వచ్చిందంటే.. శాంతాక్లాజ్, లైటింగ్స్ ఇవన్నీ కామన్. కానీ అవన్నీ ఇంటి బయట ఉంటాయి.. ఇంట్లో ఉంటాయి. కానీ ఓ టాలీవుడ్ హీరో మాత్రం ఏకంగా తన వీపుపైనే క్రిస్మస్ ట్రీ టాటూ వేయించుకున్నాడు.
ఆ ఫోటో కాస్తా ఇప్పుడు వైరల్ అవుతుంది. దాన్ని చూసి అభిమానులు కూడా వారెవ్వా క్యా పిక్ హై అంటున్నారు. సిక్స్ ప్యాక్ బాడీతో ఉన్న ఆ హీరో ఎవరో కాదు.. మహేష్ బాబు బావ సుధీర్ బాబు. వర్కవుట్ చేస్తూ పోస్ట్ చేసిన ఫోటో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతుంది. అందులో ఆయన ఫోటో చూసి పిచ్చెక్కిపోతున్నారు ఆడియన్స్. ప్రస్తుతం ఈయన వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఏదేమైనా కూడా ఫిజిక్ విషయంలో సుధీర్ బాబు అందరికంటే ముందున్నాడు. ఇప్పుడు క్రిస్మస్ టాటూతో మరింత వైరల్ అవుతున్నాడు ఈయన.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.