జైలుకు వెళ్లనున్న ఆ టాలీవుడ్ హీరో.. ఉద్యోగాల పేరుతో కోట్లు స్వాహా..

తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్య పోలీసులు, అరెస్టులు అనే పదాలు చాలానే వినిపిస్తున్నాయి. ఆ మధ్య డ్రగ్స్ కుంభకోణం బయటికి వచ్చిన తర్వాత ఎవరెలాంటి వాళ్లో తెలుసుకోవడం కూడా కష్టంగా మారిపోయింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 15, 2019, 11:19 PM IST
జైలుకు వెళ్లనున్న ఆ టాలీవుడ్ హీరో.. ఉద్యోగాల పేరుతో కోట్లు స్వాహా..
ప్రతీతాత్మక చిత్రం
  • Share this:
తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్య పోలీసులు, అరెస్టులు అనే పదాలు చాలానే వినిపిస్తున్నాయి. ఆ మధ్య డ్రగ్స్ కుంభకోణం బయటికి వచ్చిన తర్వాత ఎవరెలాంటి వాళ్లో తెలుసుకోవడం కూడా కష్టంగా మారిపోయింది. ఇప్పుడు కూడా ఇలాంటి సంఘటనే మళ్లీ జరిగింది. తాజాగా టాలీవుడ్ హీరో.. నిర్మాత ఎస్‌కే బషీద్‌ను పోలీసులు అరెస్ట్ చేసారు. ఉద్యోగాల పేరుతో ఈయన కోట్ల కుంభకోణం చేసాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. దుబాయ్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఒక్కొక్కరి దగ్గర 30 లక్షల నుంచి కోటి వరకు వసూలు చేసాడని బషీద్‌పై ఫిర్యాదు చేసింది దుబాయ్ ఎంబసీ.
టాలీవుడ్ దర్శక నిర్మాత ఎస్‌కే బషీద్

ఆ దేశంలో ఎస్‌బికే గ్రూప్ పేరుతో బ్యాంకులను మోసం చేస్తూ.. నిరుద్యోగుల దగ్గర డబ్బులు వసూలు చేస్తూ నకిలీ వ్యాపారం చేస్తున్నాడు బషీద్. ఈయనపై దుబాయ్ ఎంబసి చేసిన కంప్లైంట్ తీసుకుని పోలీసులు విచారణ మొదలుపెట్టారు. అందులోనే సంచలన నిజాలు బయటికి వచ్చాయి. దుబాయ్ పేరుతో చాలా మంది నిరుద్యోగులను మోసం చేసాడు బషీద్. గతంలోనే ఈయనపై కొన్ని కేసులు ఉన్నాయి. అప్పట్లో ఈయన అల్లరి నరేష్, వేణు హీరోలుగా నటించిన అల్లరే అల్లరి సినిమాను నిర్మించాడు. ఆ తర్వాత మెంటల్‌ అనే మరో సినిమాను కూడా నిర్మించాడు.

టాలీవుడ్ దర్శక నిర్మాత ఎస్‌కే బషీద్

దాంతో పాటు ఎవడ్రా హీరో పేరుతో ఈయనే ఓ సినిమా చేసాడు కూడా. అందులో ఈయనే హీరో కమ్ ప్రొడ్యూసర్. అప్పట్లో బ్యాంకు ఆఫ్‌ బరోడాను మోసం చేసిన కేసులో పోలీసులు ఈయన్ని అరెస్ట్‌ చేశారు. బషీద్‌ తప్పుడు పత్రాలతో రుణాలు తీసుకున్నాడని.. వివాదంలో ఉన్న ఒక స్థలం పత్రాలను సృష్టించి ఈ రుణం తీసుకున్నాడని అప్పట్లో కేసులున్నాయి. ఇప్పటికే పలు బ్యాంకులను మోసం చేసిన కేసులో బషీద్‌ నిందితుడు. సిండికేట్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఇండిస్‌, పంజాబ్‌ బ్యాంకులను దాదాపు 100 కోట్లకు పైగా కుచ్చుటోపి పెట్టాడు. ఇప్పుడు మరోసారి ఇలాంటి పనే చేసి అడ్డంగా దొరికిపోయాడు.

First published: December 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>