Adivi Sesh: టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేష్ గురించి అందరికీ పరిచయమే. హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన దర్శకుడిగా కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. ప్రతి ఒక్క సినిమాలో హీరోగా తన పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈయన తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నాడు అడవి శేష్.
2010లో కర్మ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన అడవి శేష్.. తొలి సినిమాతోనే మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఆ తర్వాత పలు సినిమాలలో నటించి తనకంటూ ఓ సక్సెస్ ను నిలుపుకున్నాడు. ఇక 2018 లో విడుదలైన గూఢచారి సినిమాతో ఎనలేని క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ సినిమాతోనే ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఓ సినిమాలో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే ఈయన తాజాగా తీవ్ర అనారోగ్య సమస్యతో ఆస్పత్రిలో చేరాడు. అదేంటి అడవి శేష్ కి ఏమైంది అని అనుకుంటున్నారా..
ఇది కూడా చదవండి:బిగ్ బాస్ షోకు రామ్ చరణ్.. ఈరోజు షో రచ్చ మాములుగా ఉండదుగా!
గత కొన్ని రోజుల నుండి అడవి శేష్ డెంగ్యూ వ్యాధితో ఇబ్బంది పడుతూ బాధపడుతున్నాడని దీంతో అతడిని ఈనెల 18న హాస్పిటల్ లో చేర్చారని వార్తలు వినిపించాయి. అక్కడ తనకు వైద్యం చేయగా.. ప్రస్తుతం అతడికి రక్తంలో ఉన్న ప్లేట్ లెట్స్ పడిపోయాయని తెలిసింది. దీంతో మళ్లీ అతనికి చికిత్స జరుగుతుందని తెలిసింది. ఇక వైద్యులు ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యం గురించి తెలియజేస్తామని తెలిపారని అతని సన్నిహితులు తెలిపారు. ఇక అడవి శేష్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు.
ఇది కూడా చూడండి:లోదుస్తుల్లో తమన్నా.. 30 ఏళ్ళ వయసులోనూ ఘాటైన అందాలతో?
ప్రస్తుతం ఈయన శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో మేజర్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ముంబై టెర్రర్ ఎటాక్ లో దేశం కోసం ప్రాణాలు విడిచిన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం నేపథ్యంలో రూపొందుతుంది. ఇక ఈ సినిమాకు మహేష్ బాబు జి ఎన్ వి ప్రొడక్షన్ లో నిర్మాతగా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మరో మూడు ప్రాజెక్టులు లైన్ లో ఉన్నాయని తెలుస్తుంది. ఇక దీంతో ఈయన త్వరగా కోలుకోవాలని అందరూ కోరుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Adavi sesh unhealty, Adivi Sesh, Dengue fever, Hyderabad, Tollywood