హోమ్ /వార్తలు /సినిమా /

Aadi Saikumar: ఆది సాయి కుమార్ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘తీస్ మార్ ఖాన్’ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల..

Aadi Saikumar: ఆది సాయి కుమార్ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘తీస్ మార్ ఖాన్’ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల..

గ్లామరస్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కథానాయికగా నటిస్తుంది. హై యాక్షన్ వోల్టేజ్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి కళ్యాణ్ జి గోగణ దర్శకత్వం వహిస్తుండగా ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల అయ్యి మంచి ప్రేక్షకాదరణ అందుకుంది. అంచనాలకు తగ్గట్లుగా ఈ లుక్ ప్రేక్షకులను బాగా అలరించింది.

గ్లామరస్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కథానాయికగా నటిస్తుంది. హై యాక్షన్ వోల్టేజ్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి కళ్యాణ్ జి గోగణ దర్శకత్వం వహిస్తుండగా ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల అయ్యి మంచి ప్రేక్షకాదరణ అందుకుంది. అంచనాలకు తగ్గట్లుగా ఈ లుక్ ప్రేక్షకులను బాగా అలరించింది.

Aadi Saikumar: హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరస సినిమాలు చేస్తూనే ఉన్నాడు ఆది సాయికుమార్ (Aadi Saikumar). ప్రస్తుతం ఈయన మూడు సినిమాలు చేస్తున్నాడు. ప్రేమ కావాలి, లవ్లీ తర్వాత సరైన విజయం లేని ఈ హీరో.. సరైన బ్లాక్‌బస్టర్ కోసం వేచి చూస్తున్నాడు.

ఇంకా చదవండి ...

హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరస సినిమాలు చేస్తూనే ఉన్నాడు ఆది సాయికుమార్. ప్రస్తుతం ఈయన మూడు సినిమాలు చేస్తున్నాడు. ప్రేమ కావాలి, లవ్లీ తర్వాత సరైన విజయం లేని ఈ హీరో.. సరైన బ్లాక్‌బస్టర్ కోసం వేచి చూస్తున్నాడు. ఈ గ్యాప్‌లోనే వరస సినిమాలు చేస్తున్నాడు ఆది. తెలుగుతో పాటు కన్నడలో కూడా నటించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు ఈ కుర్ర హీరో. తాజాగా మరో సినిమా కూడా చేస్తున్నాడు ఆది. లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించుకున్న ఆది సాయికుమార్.. పలు యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో కూడా నటించి మాస్ ఆడియెన్స్ కు కూడా చేరువయ్యాడు. అతని నుంచి రాబోతున్న తాజా చిత్రం తీస్ మార్ ఖాన్. నాటకం వంటి విభిన్న కథాంశంతో కూడుకున్న చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకులను అలరించిన దర్శకుడు కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రొడక్షన్ నెంబర్ 3 గా విజన్ సినిమాస్ బ్యానర్ పై ప్రముఖ వ్యాపారవేత్త నాగం తిరుపతిరెడ్డి ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఆకర్షించే అందం, చక్కటి అభినయంతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసిన పాయల్ రాజ్‌పుత్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండగా ఓ కీలకమైన పాత్రలో ప్రముఖ నటుడు సునీల్ నటిస్తున్నాడు. సునీల్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన తర్వాత చాలా సినిమాలు చేస్తున్నాడు. అయితే సరైన విజయం ఆయనకు కూడా రాలేదు. ఇలాంటి సమయంలో ఆది హీరోగా నటిస్తున్న తీస్‌మార్ ఖాన్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. కచ్చితంగా ఇది తనకు హెల్ప్ అవుతుందని నమ్ముతున్నాడు సునీల్. దీనికోసం రెమ్యునరేషన్ కూడా భారీగానే తీసుకుంటున్నాడు సునీల్. దసరా పండగ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్ విడుదల చేసింది చిత్ర బృందం.

Balakrishna Unstoppable Talk Show: తీస్తా.. అందరి బయోడేటా బయటికి తీస్తా.. చూస్తారుగా బాలయ్య ఆడించే ఆట..!


ఈ తీస్ మార్ ఖాన్ చిత్రంలో ఆది పవర్ ఫుల్ పాత్రలో నటిస్తుండగా హై ఓల్టేజ్ యాక్షన్ ఓల్టేజ్ ఎంటర్టైనర్‌గా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ ఫస్ట్ లుక్‌లో ఆది నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో కనిపిస్తున్నాడు. సిగరెట్ కాలుస్తూ నడుస్తూ వస్తున్నట్లు ఉన్న ఈ మాస్ లుక్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. ఇక ఈ సినిమా లో స్టూడెంట్, రౌడీ, పోలీస్ గా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్ర లో ఆది నటిస్తుండటం విశేషం. పలు హిట్ చిత్రాలకు సంగీతం అందించిన సాయి కార్తీక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ, మణికాంత్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

First published:

Tags: Aadi, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు