Home /News /movies /

TOLLYWOOD FILM INDUSTRY TFI PRODUCERS COUNCIL MEETING REGARDING TOLLYWOOD SHOOTINGS TA

Tollywood : టాలీవుడ్‌ షూటింగ్స్ విషయమై నిర్మాతల మండలి అత్యవసర సమావేశం..

నిర్మాతల మండలి అత్యవసర సమావేశం  (File/Photo)

నిర్మాతల మండలి అత్యవసర సమావేశం (File/Photo)

Tollywood : టాలీవుడ్‌ షూటింగ్స్ విషయమై నిర్మాతల మండలి అత్యవసర సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సినీ ఇండస్ట్రీలో సంబంధించిన షూటింగ్స్ విషయమై ఇందులో చర్చించారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలను నిర్మాత సి.కళ్యాణ్ మీడియాకు వెల్లడించారు.

    Tollywood : కరోనా తర్వాత అన్ని ఇండస్ట్రీస్‌ వలే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ బాగానే చితికి  పోయింది. ఇపుడిపుడే టాలీవుడ్ ఇండస్ట్రీ కోలుకుంటోంది. కరోనా పాండమిక్ తర్వాత అన్ని రేట్స్ పెరిగిపోయాయి. ఖర్చు కూడా తడిసి మోపెడవుతోంది. దీంతో సినీ ఇండస్ట్రీ పెద్దలు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి టికెట్ పెంచుకునేందుకు అనుమతులు తీసుకొచ్చారు. పెరగిన టికెట్ రేట్స్ ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 వంటి రెండు సినిమాలకు మాత్రమే ఉపయోగపడింది. ఆ తర్వాత రిలీజైన  పెద్ద సినిమాలకు పెరిగిన టికెట్ రేట్స్ గుది బండలా మారాయి. ఆ సంగతి పెక్కన ఈ మధ్య కరోనా కారణంగా సినీ ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్‌ వాళ్లకు రెండేళ్లుగా జీతాలు పెంచలేదంటూ ధర్నాకు దిగారు. ఆ తర్వాత నిర్మాతల మండలి వాళ్లు కార్మికుల జీతాాలు పెంచడానికీ అనుగుణంగా సూత్య ప్రాయంగా అంగీకారం తెలిపారు.

    సీత కష్టాలు సీతవి.. పీత కష్టాలు పీతవి అన్నట్టు నిర్మాతలు ఆగష్టు నుంచి సినిమా షూటింగ్స్ ఆపేస్తున్నట్టు ఓ వార్త ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొట్టింది. ఈ సందర్భంగా తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఈ రోజు అత్యవసర సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నిర్మాతల మండలి అధ్యక్షుడు సి. కళ్యాణ్ మాట్లాడుతూ.. కొత్త సినిమాలు నిర్మాణం ఆపే ఉద్దేశ్యం తమకు లేదన్నారు. దీంతో పాటు నిర్మాతలు అందరం కూర్చొని మా సమస్యలపై చర్చించామన్నారు. ఇక ప్రేక్షకులకు సరసమైన ధరల్లో అందుబాటులోకి టికెట్ ధరలతో పాటు కంటెంట్‌తో పాటు రిలీజైన సినిమాలు ఎన్ని రోజులకు ఓటీటీకి ఇవ్వాలనే దానిపై ఈ సమావేశంలో చర్చించినట్టు నిర్మాత కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

    Chiranjeevi : చిరంజీవిని మెగాస్టార్‌ను చేసిన ఫ్లాప్ సినిమా కథ ఏంటో తెలుసా..?


    షూటింగ్స్ బంద్ చేయాలా లేకపోతే కొత్తవి మొదలు పెట్టకుండా జరుగుతున్న సినిమాల వరకు మాత్రమే షూటింగ్ జరపాలానే దానిపై చర్చిస్తున్నామన్నారు. ఈ నెల 23న జరిగే మీటింగ్‌లో ఆల్  సెక్టార్స్ కూర్చొని ఫిలిం ఛాంబర్ అంతిమ నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ మీటింగ్‌లో కార్మికలు  పని పరిస్థితులు &  రేట్లు, ఫైటర్స్ యూనియన్ సమస్యలపై చర్చిస్తామన్నారు.



    ఫెడరేషన్ సమస్యలు, మేనేజర్ ల పాత్ర ,నటులు /టెక్నీషియన్ల సమస్యల పై సమావేశంలో చర్చ జరిగేలా చూస్తామన్నారు.  ఈ ప్రత్యేక సమావేశమునకు నిర్మాత దిల్ రాజు, ప్రసన్న కుమార్, జెమిని కిరణ్, వడ్లపట్ల మోహన్, నట్టి కుమార్, ఏలూరి సురేందర్ రెడ్డి, అభిషేక్ నామా, వై వీ ఎస్ చౌదరి, సునీల్ నారంగ్, టాగూర్ మధు, సుధాకర్ రెడ్డి, అభిషేక్ అగర్వాల్,తమ్మారెడ్డి భరద్వాజ, అశోక్ కుమార్, చిట్టురీ శ్రీనివాస్, బెక్కం వేణుగోపాల్ తదితరులు హాజరయ్యారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: C.Kalyan, Dil raju, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు