Pawan Kalyan - Kathi Mahesh: చావు బతుకుల మధ్య కత్తి మహేష్.. పవన్ ఫ్యాన్స్ కోరిక ఇదే..!

కత్తి మహేష్ (Kathi Mahesh)

Pawan Kalyan - Kathi Mahesh: కత్తి మహేష్, పవన్ కళ్యాణ్(Pawan Kalyan - Kathi Mahesh) అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత శత్రుత్వం ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. చిన్న పిల్లాడిని అడిగినా కూడా పవన్, మహేష్ కత్తి మధ్య గొడవ జరుగుతుందని చెప్పేస్తాడు.

  • Share this:
కత్తి మహేష్, పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత శత్రుత్వం ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. చిన్న పిల్లాడిని అడిగినా కూడా పవన్, మహేష్ కత్తి మధ్య గొడవ జరుగుతుందని చెప్పేస్తాడు. అంతగా కొన్నేళ్లుగా పవన్ అభిమానులను రెచ్చగొట్టాడు ఈయన. అలాంటి మహేష్ కత్తి ఇప్పుడు చావు బతుకుల మధ్య ఉన్నాడు. చెన్నై, నెల్లూరు జాతీయ రహదారిపై ఈయన ప్రయాణిస్తున్న కారు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఇందులో కత్తి మహేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ముఖ్యంగా తలకు చాలా దెబ్బలు తగిలాయి. దాంతో పాటు కన్ను దగ్గర కూడా భారీ గాయం అయిందని వైద్యులు తెలిపారు. యాక్సిడెంట్ జరిగినప్పటి నుంచి కూడా వెంటిలేటర్‌పైనే ఉన్నాడు మహేష్ కత్తి. ఈయన పరిస్థితి తెలిసిన తర్వాత పాత విషయాలన్నీ అంతా మరిచిపోయారు. సోషల్ మీడియాలో గెట్ వెల్ సూన్ కత్తి మహేష్ అంటూ పోస్ట్ చేస్తున్నారు. అందులో మరో విశేషం ఏంటంటే.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు.

ఓ మనిషి ఉన్నపుడే పగలు ప్రతీకారాలు ఉంటాయి. అదే మనిషి చావు బతుకుల మధ్య పోరాడుతున్నపుడు.. అవన్నీ మరిచిపోతారు. ఇప్పుడు పవన్ ఫ్యాన్స్‌తో పాటు అందరూ ఇదే చేస్తున్నారు. మానవత్వం చూపిస్తున్నారు.. కత్తి మహేష్‌ను వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నారు.











నెల్లూరులో సరైన వైద్య సదుపాయం లేకపోవడంతో చెన్నైలోని మెడికోర్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ మహేష్ కత్తికి చికిత్స అందిస్తున్నారు. ఈయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తుంది.
Published by:Praveen Kumar Vadla
First published: