Film Chamber - Pawan Kalyan: పవన్‌ కళ్యాణ్ వ్యాఖ్యలకు మాకు సంబంధం లేదు.. ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రకటన

Film Chamber - Pawan Kalyan

Film Chamber - Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకకు హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఈ వేదికగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం

  • Share this:
    Film Chamber - Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకకు హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఈ వేదికగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగానే ఏపీ ప్రభుత్వం చిత్రపరిశ్రమను ఇబ్బందులకు గురి చేస్తోందని.. నేను సినిమా తీయడం వల్ల చిత్ర పరిశ్రమను ఇబ్బందులలో పెట్టడం సరికాదని పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

    ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు స్పందిస్తూ ఏపీ మంత్రులు తమదైన శైలిలో సమాధానం తెలియజేశారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన వ్యాఖ్యలు ఇటు చిత్ర పరిశ్రమలోను అటు ఏపీ ప్రభుత్వం మధ్య సంచలనంగా మారింది. ఇదిలా ఉండగా తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పందించి ప్రెస్ నోట్ విడుదల చేసింది.

    తెలుగు సినిమా పరిశ్రమకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల మద్దతు ఎంతో అవసరం. చిత్ర పరిశ్రమకు రెండు తెలుగు రాష్ట్రాలు రెండు కళ్ళు లాంటివని, ప్రభుత్వ మద్దతు తెలిపినప్పుడే చిత్ర పరిశ్రమ మనుగడ కొనసాగుతుందని ఫిలిం ఛాంబర్ పేర్కొంది. ప్రస్తుతం చిత్ర పరిశ్రమ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటుందని ఈ విషయంపై ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. అయితే ఆ వ్యక్తిగత అభిప్రాయాలను వివిధ వేదికలపై తెలియజేస్తున్నారు.

    ఇలా వ్యక్తిగతంగా చెప్పే అభిప్రాయాలకు.. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు ఏ విధమైనటువంటి సంబంధం లేదని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రెస్ నోట్ విడుదల చేసింది. కరోనా మహమ్మారి కారణంగా తెలుగు సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న కష్టాలు అన్నింటిని ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము. అయితే ఈ సమస్యలపై ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ సమస్యలను పరిష్కరిస్తామని వెల్లడించారు.

    Film Chamber - Pawan Kalyan
    Film Chamber - Pawan Kalyan


    కరోనా సమయంలో ఎన్నో వేలాది కుటుంబాలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఈ సందర్భంగా వెల్లడించారు. చిత్రపరిశ్రమకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ సహకారాలు పూర్తిగా ఉన్నాయని,ఎప్పటికీ చిత్రపరిశ్రమను రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ విధంగానే ఆదుకోవాలని ఈ సందర్భంగా ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వెల్లడించారు.
    Published by:Navya Reddy
    First published: