తన ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ ఇచ్చిన పోసాని కృష్ణమురళి..

పోసాని కృష్ణ‌ముర‌ళి.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ర‌చ‌యిత‌గా 100 సినిమాల‌కు పైగా ప‌ని చేసిన ఈయ‌న‌.. ఆ త‌ర్వాత ద‌ర్శ‌కుడిగా కూడా మారాడు. ఆ త‌ర్వాత న‌టుడిగా మారి ఏడాదికి క‌నీసం 40 సినిమాలు చేస్తున్నాడు పోసాని. తాజాగా తన ఆరోగ్య విషయమై పోసాని స్పందించారు.  

news18-telugu
Updated: July 14, 2019, 11:46 AM IST
తన ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ ఇచ్చిన పోసాని కృష్ణమురళి..
న్యూస్ 18తో పోసాని కృష్ణమురళి
news18-telugu
Updated: July 14, 2019, 11:46 AM IST
పోసాని కృష్ణ‌ముర‌ళి.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ర‌చ‌యిత‌గా 100 సినిమాల‌కు పైగా ప‌ని చేసిన ఈయ‌న‌.. ఆ త‌ర్వాత ద‌ర్శ‌కుడిగా కూడా మారాడు. ఆ త‌ర్వాత న‌టుడిగా మారి ఏడాదికి క‌నీసం 40 సినిమాలు చేస్తున్నాడు పోసాని. ఓ వైపు సినిమాల‌తో బిజీగా ఉంటూనే మ‌రోవైపు రాజ‌కీయాల్లోనూ ఉన్నాడు పోసాని కృష్ణ‌ముర‌ళి. వైసీపీలో చేరి జ‌గ‌న్ త‌ర‌ఫున ప్ర‌చారం కూడా చేసాడు. ఈ క్ర‌మంలోనే టీడీపీతో పాటు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఓ రేంజిలో విరుచుకుప‌డిన సంగతి తెలిసిందే కదా. ఐతే.. గత కొన్నేళ్లుగా కీళ్ల నొప్పుల సమస్యలతో బాధ పడుతున్న పోసాని కృష్ణమురళి..రీసెంట్‌గా యశోదా ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న సంగతి తెలసిందే. ఇక ఆరోగ్యం కుదటపడి ఇక యదావిధిగా సినిమాలు చేస్తాడనుకున్న పోసాని కృష్ణమురళికి కీళ్ల ఆపరేషన్ వికటించినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. తాజాగా తన ఆరోగ్య విషయమై పోసాని స్పందించారు.

తాను తీవ్ర అనారోగ్యానికి గురైన మాట నిజమే అని ఒప్పుకున్నాడు. అలా అనీ చనిపోయే పరిస్థితిలో మాత్రం లేనని క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం తాను విశ్రాంతి తీసుకుంటున్నానని త్వరలో పూర్తిగా కోలుకొని పది రోజుల్లో షూటింగ్‌లకు హాజరయ్యేందకు సిద్దమవుతున్నట్టు తెలిపారు. అంతేకాదు ఒక పాపులర్ తెలుగు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వీడియో సందేశం కూడా ఇచ్చారు. అంతేకాదు తన ఆరోగ్యం కుదటపడాలని ప్రార్థించిన వారందరీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసారు.

First published: July 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...