టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ హరి కిషన్ కన్నుమూత..

టాలీవుడ్‌లో కాసేటి క్రితమే వాణిశ్రీ  కుమారుడు విషాదం మరిచిపోకముందే.. ఇంకో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నటుడు హరి కిషన్ కన్నుమూసారు.

news18-telugu
Updated: May 23, 2020, 3:41 PM IST
టాలీవుడ్‌లో మరో విషాదం..  ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ హరి కిషన్ కన్నుమూత..
మిమిక్రీ ఆర్టిస్ట్ హరి కిషన్ కన్నుమూత (Twitter/Photo)
  • Share this:
టాలీవుడ్‌లో కాసేటి క్రితమే వాణిశ్రీ  కుమారుడు విషాదం మరిచిపోకముందే.. ఇంకో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నటుడు హరి కిషన్ సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో కన్నుమూసారు. ఆయన గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నారు. ఆయనకు వైద్యులు డయాలిసిస్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన రెండు కిడ్నీలు ఫెయిల్ అవ్వడంతో ఆయన తుది శ్వాస విడిచారు.  ఆయన వయసు 57 ఏళ్లు. ఈయన కొడుకులు ఆస్ట్రేలియా ఉండటం.. వాళ్లు ఇక్కడికి రావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉండుటంతో  ఆయన భౌతిక కాయాన్నిహాస్పిటల్‌లోని మార్చురిలో భద్రపరిచారు.  ఈయన తెలుగులో ఎన్టీఆర్ ఏఎన్నార్ మొదలుకొని అలనాటి హీరోలతో  పాటు  ఆ తర్వాత తరం హీరోలైన కృష్ణ,  శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్తో పాటు ఇప్పటి తరం హీరోలైన ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ వరకు అందరి హీరోల గొంతులను అనుకరించి మైమరిపించారు. అంతేకాదు ఈయన తెలుగు రాష్ట్రాల్లో అప్పటి ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్, వైయస్ఆర్ వంటి అగ్ర రాజకీయ నాయకుల గొంతులను మిమిక్రీ చేసి శభాష్ అనిపించారు.

tollywood famous mimicry artist hari kishan no more, mimicry artist hari kishan no more, mimicry artist hari kishan died, mimicry artist hari kishan dead, mimicry artist hari kishan shows, mimicry artist hari kishan died,hari kishan mimicry shows,tollywood,telugu cinema,మిమిక్రీ ఆర్టిస్ట్ హరికిషన్ కన్నుమూత,హరి కిషన్ కన్నుమూత,మిమిక్రీ కళాకారుడు హరి కిషన్ కన్నుమూత,మిమిక్రీ ఆర్టిస్ట్ హరికిషన్ అకాల మరణం
మిమిక్రీ చేస్తే హరికిషన్ (File/Photo)


తన మిమిక్రీతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న హరికిషన్.. మే 30, 1963 తేదీన శ్రీమతి రంగమణి, V.L.N.చార్యులు దంపతులకు ఏలూరులో జన్మించారు. అంతేకాదు చిన్నప్పటడే 8 ఏళ్ల వయసులోనే తన గురువులను తోటి వాళ్ల గొంతులను మిమిక్రీ చేయడాన్ని ప్రారంభించారు హరికిషన్. అలా ప్రారంభమైన హరికిషన్ మిమిక్రీ ప్రస్థానం... ఆ తర్వాత సినీ నటులు, గాయకులు, క్రికెట్ కళాకారులు, రాజకీయ నాయకుల గొంతులను అనుకరిస్తూ పాపులర్ అయ్యారు. అంతేకాదు మిమిక్రీలో తన కంటూ ప్రత్యేక పేజీలు రాసుకున్నారు. కేవలం మిమిక్రీ మాత్రమే కాదు పశు పక్ష్యాదుల శబ్ధాలతో పాటు యంత్రాలు చేసే శబ్ధాలు.. సంగీత వాద్య పరికరాల సౌండ్స్‌ను తన గొంతులో పలకించడం హరి కిషన్ ప్రత్యేకత. 1971లో తొలిసారి విజయవాడలో మిమిక్రీ ప్రదర్శన చేసారు. ఆ తర్వాత ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. మిమిక్రీ కళాకారుడిగా దేశ విదేశాల్లో వేలాది ప్రదర్శనలతో ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. ప్రముఖ నటుడు శివారెడ్డికి ఈయన గురువు కూడా. ఆయన మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు అని చెప్పాలి. ఆయన మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ ఆయనతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

 
First published: May 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading