విజయ్ దేవరకొండ.. హీరోగా నటించిన ‘అర్జున్ రెడ్డి’ తెలుగులో బ్లాక్ బస్టర్ సక్సెస్ అయింది. తాజాగా ఈ సినిమాను దర్శకుడు సందీప్ రెడ్డి బాలీవుడ్లో షాహిద్ కపూర్ హీరోగా ‘కబీర్‌సింగ్’ టైటిల్‌తో రీమేక్ చేసారు. ఈ సినిమాలోొ షాహిద్‌కు జంటగా కియారా అద్వానీ నటించింది. అయితే సినిమా విడుదలైన కొత్తలో ఈ మూవీపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే కదా. ఐతే తాజాగా ఈ సినిమాపై ప్రముఖ బాలీవుడ్ స్క్రిప్ట్ రైటర్ కనిక థిల్లాన్ కీలక వ్యాక్యలు చేసారు. వివరాలలోకి వెళితే .. 'నేను నెగెటివ్ ఆలోచనలతో 'కబీర్ సింగ్' సినిమాకు వెళ్లాను. కానీ, సినిమా చూస్తుండగా ఒక్కసారిగా అందులో లీనమైపోయాను అంటున్నారు కనిక థిల్లాన్. ఈపేరు టాలీవుడ్ లో చాలా మందికి తెలియకపోవచ్చు.కానీ బాలీవుడ్ స్క్రీన్ ప్లే రైటర్ గా పేరుతెచ్చుకున్న కనికా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కోడలు, ప్రకాష్ కోవెలమూడి భార్య.

విజయ్ దేవరకొండ షాహిద్ కపూర్
తెలుగులో ప్రకాష్ కోవెలమూడి డైరెక్ట్ చేసిన 'సైజ్ జీరో' సినిమాకి కూడా కథ అందించింది ఈమెనే.అలాగే కంగనా వివాదాస్పద చిత్రం 'జడ్జిమెంటల్ హై క్యా'కు కూడా కథ, స్క్రీన్‌ప్లే ఈమెనే అందించింది. తాజాగా కనిక 'కబీర్ సింగ్' సినిమా చూసినట్లు స్వయంగా వెల్లడించారు.అంతేకాదు ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని కూడా పంచుకున్నారు. నేను నెగెటివ్ ఆలోచనలతో 'కబీర్ సింగ్' సినిమాకు వెళ్లాను. కానీ, సినిమా చూస్తుండగా ఒక్కసారిగా అందులో లీనమైపోయాను. ఈ క్రమంలోనే అతడు తన ప్రేమ కోసం పిచ్చోడిలా అయిపోవడం నుంచి బయటకు రావాలని కోరుకున్నాను'' అని చెప్పుకొచ్చారు. ఈ సినిమాపై చాలామంది క్రిటిక్స్ తక్కువ రేటింగులు ఇచ్చారు. ఈ సినిమాపై నెగెటివ్ కామెంట్స్ చేసారు. ''విమర్శకులు చెప్పినదానిని నేను పట్టించుకోను. ఈ చిత్రంలోని పాత్ర నిస్సహాయ పరిస్థితిలో ఉన్నప్పుడు అతను ఏ విధంగా నైనా ప్రవర్తించగలడు అని గుర్తించాలి అంటూ కనిక తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు
Published by:Kiran Kumar Thanjavur
First published:July 19, 2019, 13:51 IST