Manchu Lakshmi: నాపై వ‌చ్చే ట్రోల్స్ చూసి ఒక్కొసారి రిలాక్స్ అవుతుంటా.. న‌్యూస్ 18 తో మంచు ల‌క్ష్మి..

మంచు లక్ష్మి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ (Twitter/Photo)

Manchu Lakshmi Exclusive Interview With News18 | మంచు లక్ష్మి... ఓ నటిగా.. నిర్మాతగా.. టెలివిజ‌న్ హోస్ట్‌గా, ఆపై మోహన్ బాబు తనయగా..  త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక‌మైన గుర్తింపు తెచ్చుకున్న మంచు లక్ష్మీ... తాజాగా  మ‌రోక కొత్త షో తో ప్రే‌క్ష‌కుల‌ను అల‌రించ‌డానికి రెడీ అవుతున్నారు.  ఈ సంద‌ర్భంగా న్యూస్ 18 తో ప్ర‌త్యేకంగా మాట్లాడారు మంచు ల‌క్ష్మి.

  • Share this:
    Manchu Lakshmi Exclusive Interview With News18 | మంచు లక్ష్మి... ఓ నటిగా.. నిర్మాతగా.. టెలివిజ‌న్ హోస్ట్‌గా, ఆపై మోహన్ బాబు తనయగా..  త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక‌మైన గుర్తింపు తెచ్చుకున్న మంచు లక్ష్మి... తాజాగా  మ‌రోక కొత్త షో తో ప్రే‌క్ష‌కుల‌ను అల‌రించ‌డానికి రెడీ అవుతున్నారు.  ఈ సంద‌ర్భంగా న్యూస్ 18 తో ప్ర‌త్యేకంగా మాట్లాడారు మంచు ల‌క్ష్మి.

    మంచు లక్ష్మి గారు ఎందుకు ఈ మ‌ధ్య అటు బిగ్‌ స్క్రీన్‌కు ఇటు స్మాల్ స్క్రీన్ కాస్త గ్యాప్ ఇచ్చినంటున్నారు ? 

    గ్యాప్ నేను ఇచ్చింది కాదు... అలా వ‌చ్చేసింది అంతే.  మరోవైపు కరోనా వల్ల నేను చేయాల్సిన ప్రాజెక్టులు ఆలస్యమయ్యాయి. లేకపోతే ఇప్ప‌టికి నేను ఎవర్ రెడీ.  క్యారెక్టర్ నచ్చితే  చిన్న పాత్ర అయిన చేయ‌డానికి కూడా రెడీ గా ఉన్నాను. మన తెలుగు ప్ర‌ేక్షకులు ముందు ఒక మంచి న‌టిగా ఉండాల‌ని నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. రెండు రాష్ట్రాల తెలుగు ప్ర‌జ‌లు న‌న్ను వాళ్లు సొంత కూతు‌రులా ఆదరిస్తున్నారు.

    ‘ఊ కొడ‌తారా ఉలిక్కిప‌డ‌తారా’ సినిమా త‌రువాత ఆ స్థాయిలో చెప్ప‌కొద‌గ్గ పాత్ర ఎందుకు చేయ‌లేదు?

    ఆ స్థాయిలో పాత్ర‌లు చేయ‌క‌పోవ‌డం కాదు అలాంటి పాత్ర‌లు నా దగ్గరికి రాలేదు. అంత మంచి పాత్ర‌లు ఇప్పుడు వ‌చ్చినా... చేయ‌డానికి సిధ్దంగా ఉన్నాను. అయితే అలాంటి పాత్ర‌లు రావాలి. ఆ స్థాయి పాత్ర‌లే కాదు ఎంత చిన్న పాత్ర అయిన న‌ట‌న‌కు అవ‌కాశం ఉన్న క్యారెక్ట‌ర్స్ వ‌స్తే త‌ప్ప‌కుండా చేస్తాను.

    ప్ర‌స్తుతం సినిమాల‌తో బిజీగా ఉన్నారా? లేక ఏదైన టాక్ షో స్టార్ట్ చేస్తున్నారా..?

    కొన్ని సినిమాలు మాట‌ల ద‌శ‌లోనే ఉన్నాయి దాంతోపాటు రానా ద‌గ్గు‌బాటి నిర్మాత‌గా ఒక టాక్ షో చేస్తోన్నాను.  అతి త్వ‌ర‌లో  మీ ముందుకు రాబోతుంది. గ‌తంలో నా టాక్ షోలానే అన్ని రంగాల్లో ఉన్న ప్ర‌ముఖ‌ులు, సామాన్యులే నా టాక్ షో అతిధులు.

    సోష‌ల్ మీడియాలో మీపై చాలా ట్రోల్స్ వ‌స్తోంటాయి అవి చూసిన‌ప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు?

    అస్స‌లు ప‌ట్టించుకోను...నేను నాలానే ఉంటాను. న‌న్ను తీసుకెళ్లే వేరే బాక్స్ లో పెట్ట‌డానికి ప్ర‌య‌త్నం చేయ‌కూడదు. నేను అందులో ఫిట్ కాను కూడా....కొన్ని సంద‌ర్భ‌ల్లో నాపై ట్రోల్స్ చూసి నేను రిలాక్స్ అవుతుంటాను.

    మిమ్మ‌ల్ని మంచు ల‌క్ష్మి అనే పేరుతో కాకుండా మా మంచు అక్క అని అంద‌రు పిలుస్తారు...అంద‌రు మిమ్ముల్ని అక్క అని పిల‌వ‌డం ప‌ట్ల మీ స్పంద‌న‌.

    అక్క అనే పేరుకు పేటెంట్ నేనే తీసుకుందామ‌నుకుంటున్నాను. ఎందుకంటే ఇండస్ట్రీతో పాటు బయట ప్రేక్షకులు అంద‌రూ న‌న్ను అక్క అక్క అని పిలిస్తుంటారు. నిజానికి అది ఒక గొప్ప గౌర‌వం అనుకుంటాను. ఆ పిలుపులోనే  వాళ్ల సొంత మ‌నిషి అనే భావ‌న అందులో క‌నిపిస్తోంది. అందుకు అక్క అనే పేరు నాకు మాత్ర‌మే సొంతం.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: