Raghavendra Rao: నటుడిగా మారిన రాఘవేంద్రరావు.. వైరల్ వీడియో!

Raghavendra Rao: తెలుగు సిని స్టార్ దర్శకుడు రాఘవేంద్ర రావు పరిచయం గురించి తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిందే. ఈయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ మంచి సక్సెస్ ను అందుకున్నాయి.

Raghavendra Rao: తెలుగు సిని స్టార్ దర్శకుడు రాఘవేంద్ర రావు పరిచయం గురించి తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిందే. ఈయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ మంచి సక్సెస్ ను అందుకున్నాయి.

  • Share this:
    Raghavendra Rao: తెలుగు సిని స్టార్ దర్శకుడు రాఘవేంద్ర రావు పరిచయం గురించి తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిందే. ఈయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ మంచి సక్సెస్ ను అందుకున్నాయి. ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కథలతో ముందుకు వస్తాడు. తన దర్శకత్వంతో ఎంతో మందిని అభిమానులుగా మార్చుకున్నాడు. ఇదిలా ఉంటే రాఘవేంద్ర రావు నటుడిగా మారాడు.

    తెరవెనుక ఉండి ఎన్నో అద్భుతమైన సినిమాలను తెర ముందుకు తీసుకొచ్చిన రాఘవేంద్రరావు తనకంటూ ఓ స్టార్ హోదాను అందుకున్నాడు. దాదాపు వందకు పైగా సినిమాలకు దర్శకత్వం వహించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇదిలా ఉంటే 1996లో విడుదలైన 'పెళ్లిసందడి' సినిమాను.. మళ్లీ మోడ్రన్ 'పెళ్లిసందడి' తో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. ఇక ఈ సినిమాకి శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నటిస్తున్నాడు. నటి శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.

    ఇదిలా ఉంటే ఈ సినిమాలో తొలిసారిగా రాఘవేంద్రరావు తెరముందుకు వస్తున్నాడు. పైగా ఇందులో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో విడుదల చేస్తూ ప్రకటించారు. ఇక ఆ వీడియోలో వశిష్ట అనే పేరుతో వస్తున్న సంగీతంతో.. 'సుమారు 100 కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన మన మౌనముని తొలిసారి కెమెరా ముందుకు వచ్చారు' అని తెలిపారు. ఇందులో రాఘవేంద్రరావు ఎప్పుడు ప్రేక్షకులకు కనిపించని విధంగా కనిపించాడు.



    సూట్ ధరించి కళ్ళజోడు పెట్టుకొని గ్రౌండ్ లో బాస్కెట్ బాల్ పట్టుకొని కనిపించగా.. ఇందులో ఆయనతో పాటు పలువురు నటులు కూడా ఉన్నారు. మొత్తానికి ఇందులో రాఘవేంద్రరావు లుక్ నెటిజన్లను బాగా ఆకట్టుకోగా తెగ లైక్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందించగా.. గౌరీ రోనంకి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాతలుగా చేస్తున్నారు. అంతేకాకుండా ఇందులో పాటలు కూడా విడుదల కాగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు తెగ ఎదురు చూస్తున్నట్లుగా అర్థమవుతుంది.
    First published: