దాసరి నారాయణ రావు వ్యక్తి కాదు సమాజం.. నేడు ఆయన 73వ జయంతి..

తెలుగు చిత్ర సీమకు పెద్దన్నలా వ్యవహరించిన దాసరి 73వ జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయన్ను తెలుగు చిత్ర పరిశ్రమ గుర్తు చేసుకుంటోంది.

news18-telugu
Updated: May 4, 2020, 12:44 PM IST
దాసరి నారాయణ రావు వ్యక్తి కాదు సమాజం.. నేడు ఆయన 73వ జయంతి..
దాసరి నారాయణ రావు (Photo: facebooK)
  • Share this:
ఆయనకు చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అన్న తేడా లేదు.. కుటంబ కథా చిత్రమైనా, సమాజాన్ని మేల్కొలిపే సినిమాలైనా, రంజుగా సాగే రాజకీయ మువీ అయినా తీయడం ఆయనకే చెల్లింది. తన మార్కును చూపిస్తూ హీరోలకు దీటుగా పేరు సంపాదించుకున్న దర్శకుడు ఆయన.. ఆయన మరెవరో కాదు.. దాసరి నారాయణ రావు. తెలుగు చిత్ర సీమకు పెద్దన్నలా వ్యవహరించిన దాసరి 73వ జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయన్ను తెలుగు చిత్ర పరిశ్రమ గుర్తు చేసుకుంటోంది. ఇండస్ట్రీలో ఏ చిన్న గొడవ జరిగినా ఆయన తలుపు తట్టేవాళ్లు. దాస‌రి నారాయ‌ణ‌రావు ఉన్నపుడు చిన్నా పెద్ద తేడా లేకుండా అంద‌రి సినిమాల‌కు వ‌చ్చేవారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా ఆడియోకు వ‌చ్చి ఆశీర్వాదం ఇచ్చేవారు.. అలాగే రాజ్ త‌రుణ్ సినిమాకు కూడా వ‌చ్చేవారు. ఆయ‌న పోయిన త‌ర్వాత చిన్న సినిమాల‌కు పెద్ద దిక్కు లేకుండా పోయిందంటేనే అర్థం చేసుకోవచ్చు ఆయన నాయకత్వ లక్షణం ఎలాంటిదో..!

అత్యధిక సినిమాలు దర్శకత్వం చేసి గిన్నిస్ బుక్ రికార్డులోకి ఎక్కిన దాసరి.. కుటుంబం ఉన్న నడివయసు వ్యక్తితో మేఘసందేశం లాంటి ప్రేమకథ తీయడం ఆయన ధీరత్వాన్ని ప్రదర్శించింది. కుటుంబ కథా చిత్రాలు అమ్మా రాజీనామా, సూరిగాడు, భగ్న ప్రేమకథలు ప్రేమాభిషేకం, మజ్ను, స్వయంవరం లాంటి చిత్రాలే కాదు, వర్ణ వివక్షను ప్రశ్నించే బలిపీఠం, అవినీతి మీద ఎమ్మెల్యే ఏడుకొండలు, దొరల పెత్తనం మీద ఒసేయ్ రాములమ్మ లాంటి సామాజిక చిత్రాలు తీశారు. ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశానికి కారణమైన బొబ్బిలిపులి, సర్దార్ పాపరాయుడు, మనుషులంతా ఒక్కటే చిత్రాలు దాసరి గారి దర్శకత్వంలో వచ్చినవే.

దర్శకుడిగా, నటుడిగా, రచయితగా ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి.. దాసరి. కేంద్రమంత్రిగా, పత్రిక అధినేతగా తన మార్కును చూపించారాయన. అందుకే.. తెలుగు చిత్ర సీమకు ఆయన చేసిన సేవను మళ్లీ మళ్లీ స్మరించుకోవాల్సిన తరుణం ఇది.
First published: May 4, 2020, 12:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading