Tollywood Drugs Case : టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ (Enforcement Directorate) ఎదుట కాసేటి క్రితమే రానా దగ్గుబాటి (Rana Daggubati) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల ముందు రానా .. తన పర్సనల్ స్టాఫ్‌తో కలిసి ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఈడీ అధికారులు డ్రగ్స్ కొనుగోలు విషయంలో రానా దగ్గుబాటిని విచారిస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రానా ను ఏయే ప్రశ్నలు అడిగే అవకాశం ఉందనే దానిపై ఉత్కంఠ నెలకొని ఉంది. టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు (Tollywood Drug Case) గత కొన్ని రోజులుగా విచారణ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా మనీ లాండరింగ్ చట్టం కింద టాలీవుడ్‌కు చెందిన 12 మందికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది.
అందులో భాగంగా ఇప్పటికే దర్శకుడు పూరి జగన్నాథ్‌ను ప్రముఖ నటి, నిర్మాత (Charmi) ఛార్మి, రకుల్ ప్రీత్ సింగ్, నందును ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా మనీ లాండరింగ్ నేపథ్యంలో రానా అనుమానాస్పద లావాదేవిలను ప్రశ్నించే అవకాశాలున్నాయి. అంతేకాదు డ్రగ్స్ పెల్లర్ కెల్విన్‌తో పాటు ఎఫ్ క్లబ్ గురించి ప్రశ్నలు అడిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఈడీ అధికారులు కెల్విన్ పర్సనల్ లాప్‌టాప్ నుంచి పలు విషయాలు రాబట్టారు.
గతంలో రానా కూడా బాలీవుడ్ సంబందాలు, తరుచు పార్టీలకు వెళ్లే అలవాటు ఉండటంతో నాకు కూడా ఈ డ్రగ్స్‌తో సంబంధాలు అంటగట్టడం దారుణమన్నారు. సినిమా వాళ్లు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే అది పర్సనల్ ఇష్యూ.. ఎవరి వ్యక్తిగత జీవితం వారిది. పైగా స్కూలు పిల్లలు కూడా డ్రగ్స్ బానిసలు అవుతున్నారని రానా పలు సందర్భాల్లో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే కదా.
ఈడీ విచారణకు హాజరుకానున్న ప్రముఖుల విచారణ తేదీలు ఇలా ఉన్నాయి. పూరి జగన్నాథ్ - ఆగస్టు 31, ఛార్మి - సెప్టెంబర్ 2, రకుల్‌ప్రీత్ సింగ్ - సెప్టెంబర్ 6, రానా దగ్గుబాటి - సెప్టెంబర్ 8, రవితేజ - సెప్టెంబర్ 9, శ్రీనివాస్ - సెప్టెంబర్ 9, నవదీప్ - సెప్టెంబర్ 13, ఎఫ్ క్లబ్ జనరల్ మేనేజర్ - సెప్టెంబర్ 13, ముమైత్ ఖాన్ - సెప్టెంబర్ 15, తనీష్ - సెప్టెంబర్ 17, నందు - సెప్టెంబర్ 20, తరుణ్ - సెప్టెంబర్ 22న విచారణకు హాజరు కానున్నారు.
రానా దగ్గుబాటి సినిమాల విషయానికొస్తే.. ఈ యేడాది ‘అరణ్య’ సినిమాతో పలకరించారు. ఇక ఈయన నటించిన ‘విరాట పర్వం’ సినిమా త్వరలో విడుదల కానుంది. మరోవైపు రానా దగ్గుబాటి పవన్ కళ్యాణ్‌తో కలిసి ‘భీమ్లా నాయక్’ సినిమా చేస్తున్నారు.ఈ సినిమాలో పవర్‌ఫుల్ మిలిటరీ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. దాంతో పాటు బాలీవుడ్‌లో పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటించనున్నట్టు సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.