Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో రవితేజ, పూరీ, ఛార్మి, ముమైత్ ఖాన్ సహా పలువురికి ఊరట..

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో రవితేజ, పూరీ జగన్నాథ్ సహా పలువురుకి ఊరట (File/Photo)

Tollywood Drugs Case: అప్పట్లో టాలీవుడ్‌లో పెద్ద ప్రకంపనలు పుట్టించిన డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ పలువురుకి క్లీన్ చిట్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే...

  • Share this:
    Tollywood Drugs Case: అప్పట్లో టాలీవుడ్‌లో పెద్ద ప్రకంపనలు పుట్టించిన డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ పలువురుకి క్లీన్ చిట్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే...ఒకప్పుడు బాలీవుడ్‌కు మాత్రమే పరిమితమైన డ్రగ్స్ మాఫియా.. తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీకి కూడా పాకింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌‌లో కొంత మంది నటీనటులు కొంత మంది విదేశీయలు నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. సరిగ్గా నాలుగేళ్ల క్రితం జూలై 2న ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేసారు.  హైదరాబాద్ మాదక ద్రవ్యాల నిరోధక విభాగం టాలీవుడ్‌కు చెందిన కొంత మంది  సినీ ప్రముఖులను నార్కోటిక్స్ విభాగం వారి ఆఫీసుకు పిలిచి విచారించింది. అప్పట్లో ఈ కేసు టాలీవుడ్‌లో పెద్ద ప్రకంపనలే పుట్టించింది. ఈ కేసులో హీరో రవితేజ కారు డ్రైవరుతో  పాటు దర్శకుడు పూరీ జగన్నాథ్, ఛార్మి కౌర్, ముమైత్ ఖాన్, తరుణ్, నవదీప్ సహా పలువురును విచారించారు. మొత్తంగా టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ పోలీసులు మొత్తంగా 12 కేసులు నమోదు చేసి 30 మందికి పైగా అరెస్ట్ చేసారు. అంతేకాదు 27 మందిని విచారించారు. 12 కేసుల్లో ముందుగా 8 కేసుల్లో మాత్రమే పోలీస్ అధికారులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.

    తాజాగా ఈ కేసులో రవితేజ, పూరీ జగన్నాథ్, ఛార్మి, ముమైత్ ఖాన్, తరుణ్, నవదీప్, తనీష్, సుబ్బరాజు సహా 11 మందికి ఎక్సైజ్‌ డిపార్ట్‌మెంట్ క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే ఈ కేసులో పోలీసులు పలుకుబడి ఉన్న పెద్ద తలకాయలను ఒదిలిపెట్టి.. చిన్న చిన్న ఆర్టిస్టులపై ఎక్కువ ఫోకస్ చేసారనే ఆరోపణలు వచ్చాయి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: