Tollywood Drugs Case : టాలీవుడ్ డ్రగ్స్ కేసులో (Tollywood Drugs Case) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) ఇప్పటికే పలువురు సినీ నటులు, దర్శకులను ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే కదా. కొన్నాళ్ల క్రితం టాలీవుడ్‌లో పెద్ద ప్రకంపనలు పుట్టించిన డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ పలువురుకి క్లీన్ చిట్ ఇచ్చింది. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. ఈ కేసులో చిన్న పెద్దా అని తేడా లేకుండా చాలా మంది హీరోలు, హీరోయిన్లు, నటీనటుల, దర్శకుల చుట్టూ డ్రగ్స్ రాకేట్ ఉచ్చు బిగుసుకుంది. అందులో స్టార్ హీరో హీరోయిన్లు కూడా ఉండటం సంచలనంగా మారింది. ఒకప్పుడు బాలీవుడ్‌కు మాత్రమే పరిమితమైన డ్రగ్స్ మాఫియా.. తెలుగుతో పాటు తమిళ, కన్నడ ఇండస్ట్రీలకి కూడా పాకింది.అంతేకాదు టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కొంత మంది సెలబ్రిటీలు డ్రగ్స్ మాఫియాకు హవాలా రూపంలో చెల్లింపులు చేసింది.
ఇపుడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ హవాల రూపంలో జరిగిన లావాదేవీలపై ఇంటర్‌పోల్ సహాయం తీసుకుంటోంది. దీంతో ఈ కసుతో సంబంధం ఉన్న నటీనటులకు సంబంధించిన బ్యాంక్ లావాదేవీలపై ఆరా తీస్తోంది. ఈ కోవలో భాగంగా మనీ లాండరింగ్ చట్టం కింద టాలీవుడ్‌కు చెందిన 12 మందికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. అందులో భాగంగా ఇప్పటికే దర్శకుడు పూరి జగన్నాథ్‌ను ప్రముఖ నటి, నిర్మాత (Charmi) ఛార్మి, రకుల్ ప్రీత్ సింగ్, నందు, రానా, రవితేజలను ఈడీ అధికారులు ప్రశ్నించారు.
ఈ రోజు విచారణలో భాగంగా .. ఎఫ్ క్లబ్ ఓనర్ హీరో నవదీప్ (Navdeep) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ముందుకు హాజరు కానున్నారు. ఆ క్లబ్ పేరిట జరిగిన బ్యాంక్ లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో నవదీప్‌తో పాటు ఆ క్లబ్ మేనేజర్ ఈ రోజు ఈడీ ముందు హాజరు కానున్నారు. ఎప్ క్లబ్ యాజమాని నవదీప్.. ఈ క్లబ్‌లో తరుచు సినీ నటులతో పార్టీలు నిర్వహించేవారు. ఈ సందర్భంగా నవదీప్ సినీ ఇండస్ట్రీలో క్లోజ్‌గా ఉండే వ్యక్తులపై ఈడీ అధికారులు దృష్టిసారించినట్టు సమాచారం.
ఈ కేసులో ప్రధాన నిందితులైన కెల్విన్, జీషాన్ అలీలు నవదీప్‌కు సంబంధించిన ఎఫ్ క్లబ్ పార్టీలకు అటెండ్ అయ్యేవారు. అపుడే వారికి సినీ నటులతో మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. ఈ ఇరువురు పలువురు సినీ నటులతో డబ్బులకు సంబంధించిన ట్రాన్జాక్షన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఫ్ క్లబ్ యాజమాన్యం.. కెల్విన్, జీషాన్ అలీతో ఎలాంటి ఆర్ధిక లావాదేవీలు నిర్వహించారనే విషయమై ఈడీ అధికారులు నవదీప్‌తో పాటు ఆయన ఎఫ్ క్లబ్ మేనేజర్‌ను విచారించనున్నారు. ఈ కేసులో ముమైత్ ఖాన్ 15న, తనీశ్ 17న, తరుణ్ 22న ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల ముందు హాజరు కానున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Enforcement Directorate, Navdeep, Tollywood, Tollywood drugs case