టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు (Tollywood Drug Case) విచారణ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా మనీ లాండరింగ్ చట్టం కింద టాలీవుడ్‌కు చెందిన 12 మందికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే దర్శకుడు పూరి జగన్నాథ్‌ను ఈడీ ప్రశ్నించగా.. ఈరోజు ప్రముఖ నటి, నిర్మాత ఛార్మిని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఉదయం మొదలైన విచారణ ఏకధాటిగా కొనసాగుతూనే ఉంది. దాదాపు ఐదు గంటల నుంచి ఈడీ కార్యాలయంలో ఛార్మి(Charmi )ని ప్రశ్నిస్తున్నారని సమాచారం. ముఖ్యంగా ఛార్మీని అధికారులు ఆమె బ్యాంకు ఖాతాలకు సంబంధించిన విషయాలపై ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది. ఇక మాదక ద్రవ్యాలను సప్లైయ్ చేసే కెల్విన్‌ను అధికారులు ప్రశ్నించారు.
అంతేకాదు అతని బ్యాంకు లావాదేవీలన్నింటినీ ఈడీ అధికారులు సేకరించారు. సేకరించిన సమాచారం ఆధారంగా ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇక ఈ కేసులో 12 మంది సినీ ప్రముఖులను ఈడీ అధికారులు విచారించనుండగా, తొలిరోజున (Puri jagannadh) దర్శకుడు పూరీ జగన్నాథ్ ఈడీ విచారణకి హాజరయ్యారు. ఇప్పటికే ఈ కేసులో 12 మంది సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఈ జాబితాలో పూరీ జగన్నాథ్‌తో పాటు నటుడు రానా దగ్గుబాటి, నటి రకుల్‌ప్రీత్ సింగ్, నిర్మాత చార్మి, నటుడు రవితేజ, నవ్‌దీప్, ముమైత్ ఖాన్, తనీష్, తరుణ్, నందులు ఉన్నారు.
వీరితో పాటు ఈ విచారణకు రవితేజ డ్రైవర్ శ్రీనివాస్, ఎఫ్ క్లబ్ జనరల్ మేనేజర్ కూడా రానున్నారు. ఈడీ విచారణకు హాజరుకానున్న ప్రముఖుల విచారణ తేదీలు ఇలా ఉన్నాయి.
పూరి జగన్నాథ్ - ఆగస్టు 31, ఛార్మి - సెప్టెంబర్ 2, రకుల్‌ప్రీత్ సింగ్ - సెప్టెంబర్ 6, రానా దగ్గుబాటి - సెప్టెంబర్ 8, రవితేజ - సెప్టెంబర్ 9, శ్రీనివాస్ - సెప్టెంబర్ 9, నవదీప్ - సెప్టెంబర్ 13, ఎఫ్ క్లబ్ జనరల్ మేనేజర్ - సెప్టెంబర్ 13, ముమైత్ ఖాన్ - సెప్టెంబర్ 15, తనీష్ - సెప్టెంబర్ 17, నందు - సెప్టెంబర్ 20, తరుణ్ - సెప్టెంబర్ 22న విచారణకు హాజరు కానున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Charmi kaur, Tollywood news