టాలీవుడ్ డ్రగ్స్ కేసు(Tollywood Drugs Case)లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ కొనసాగుతుంది. టాలీవుడ్ సెలబ్రిటీలకు, డ్రగ్స్ మాఫియా మధ్య సంబంధాలపై ఈడీ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలోనే డ్రగ్స్ కేసులో పలువురు సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసి ఒక్కో రోజు ఒక్కొక్కరిగా విచారణ చేపట్టారు. ఇప్పటికే డైరెక్టర్ పూరి జగన్నాథ్(Puri Jagannadh), నటీమణులు ఛార్మి, రకుల్ ప్రీత్ సింగ్‌లు(Rakul Preet Singh) ఈడీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. నేడు నటుడు నందు ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. అయితే నందు సెప్టెంబర్ 20వ తేదీన హాజరు కావాల్సి ఉన్నప్పటికీ.. నేడు విచారణకు హాజరయ్యారు. అయితే టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి తాజాగా మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి డ్రగ్స్ సరఫరాదారుడు కెల్విన్‌ను ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చి ప్రశ్నిస్తున్నారు.కెల్విన్ బ్యాంకు ఖాతా వివరాలను ఈడీ అధికారులు ఇప్పటికే సేకరించారు.
అంతేకాకుండా కెల్విన్‌తో పాటుగా పాతబస్తీకి చెందిన వాహిద్, కుదూస్‌ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. వీరికి నటుడు నందుకు మధ్య లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే కెల్విన్‌ను ఈడీ కార్యాలయానికి తీసుకురాక ముందు.. నందును 4 గంటల పాటు ఈడీ అధికారులు ప్రశ్నించారు.
Prabhas : ప్రభాస్ దూకుడు మాములుగా లేదుగా.. రెబల్ స్టార్ ఖాతాలో మరో రికార్డు..
నాలుగేళ్ల కిందట తెలుగు చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ కేసు పెను సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి టాలీవుడ్‌కు చెందిన పలువురు సెలబ్రిటీలను ఎక్సైజ్ శాఖ అధికారులు విచారణ చేశారు. ఇక, తాజాగా ఈ కేసు మరోసారి వెలుగులోకి వచ్చింది. ఎక్సైజ్ విభాగానికి చెందిన సిట్ దాఖలు చేసిన చార్జ్‌షీట్ల ఆధారంగా ఈడీ మనీల్యాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది. డ్రగ్స్ కేసులో నిందితుడు కెల్విన్ అఫ్రూవర్ గా మారిపోయాడు. ఈ నేపథ్యంలోనే కెల్విన్ బ్యాంకు ఖాతాలను ఈడీ ఫ్రీజ్ చేసింది. ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాల్సిందిగా 12 మంది టాలీవుడ్ సెలబ్రెటీలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది.
ఇప్పటికే పూరి జగన్నాథ్, చార్మి, రకుల్, నందులు విచారణకు హాజరు కాగా.. ఈడీ నోటీసుల ప్రకారం.. రానా దగ్గుబాటి(Rana Daggubati) - సెప్టెంబర్ 8, రవితేజ - సెప్టెంబర్ 9, శ్రీనివాస్ - సెప్టెంబర్ 9, నవదీప్ - సెప్టెంబర్ 13, ఎఫ్ క్లబ్ జనరల్ మేనేజర్ - సెప్టెంబర్ 13, ముమైత్ ఖాన్ - సెప్టెంబర్ 15, తనీష్ - సెప్టెంబర్ 17, తరుణ్ - సెప్టెంబర్ 22న విచారణకు హాజరు కావాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Enforcement Directorate, Hero nandu, Tollywood drugs case