TOLLYWOOD DRUG CASE BAHUBALI FAME RANA DAGGUBATI APPEARS TODAY ENFORCEMENT DIRECTORATE FOR QUESTIONING TA
Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈ రోజు ఈడీ ముందు హాజరు కానున్న రానా దగ్గుబాటి..
రానా దగ్గుబాటి (File/Photo)
Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈ రోజు ఈడీ ముందు హాజరు కానున్న రానా దగ్గుబాటి. ఈ సందర్భంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రానా ను ఏయే ప్రశ్నలు అడిగే అవకాశం ఉందనే దానిపై ఉత్కంఠ నెలకొని ఉంది.
Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈ రోజు ఈడీ ముందు హాజరు కానున్న రానా దగ్గుబాటి. ఈ సందర్భంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రానా ను ఏయే ప్రశ్నలు అడిగే అవకాశం ఉందనే దానిపై ఉత్కంఠ నెలకొని ఉంది. వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు (Tollywood Drug Case) గత కొన్ని రోజులుగా విచారణ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా మనీ లాండరింగ్ చట్టం కింద టాలీవుడ్‌కు చెందిన 12 మందికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. అందులో భాగంగా ఇప్పటికే దర్శకుడు పూరి జగన్నాథ్‌ను ప్రముఖ నటి, నిర్మాత (Charmi) ఛార్మి, రకుల్ ప్రీత్ సింగ్‌లను ఈడీ అధికారులు ప్రశ్నించారు. దాంతో పాటు సినీ నటుడ నందును కెల్విన్‌ను కలిసి విచారించారు. నందును ఈ నెల 20న ఈడీ ముందుకు హాజరు కావాల్సి ఉంది .కానీ ముందుస్తుగా తనను విచారించాలని కోరగా.. ఈడీ అధికారులు.. నందు పలు ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసినట్టు సమాచారం.
ఈ కేసుకు సంబంధించి డ్రగ్స్ సరఫరాదారుడు కెల్విన్‌ను ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చి ప్రశ్నిస్తున్నారు అధికారులు. అంతేకాదు కెల్విన్ బ్యాంకు ఖాతా వివరాలను ఈడీ అధికారులు ఇప్పటికే సేకరించారు. ఈ రోజు రానా ను ఏయే ప్రశ్నలు అడగనున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ సందర్భంగా రానా బ్యాంక్ అకౌంట్ వివరాలతో పాటు.. ఆయన ఎవరికైనా హవాలా రూపంలో డబ్బును ట్రాన్స్ఫర్ చేసారనే విషయాన్ని విచారించనున్నారు. డైెరెక్ట్‌గా డ్రగ్ పెల్లర్ కెల్విన్‌తో పరిచయాలు ఉన్నాయా.. మధ్యలో ఎవరైనా మధ్యవర్తులున్నారా అనే దానిపై విచారించనున్నారు. రేపు సెప్టెంబర్ 9న రవితేజ ఈడీ అధికారులు ఎదుట హాజరు కానున్నారు.
రానా దగ్గుబాటి సినిమాల విషయానికొస్తే.. ఈ యేడాది ‘అరణ్య’ సినిమాతో పలకరించారు. ఇక ఈయన నటించిన ‘విరాట పర్వం’ సినిమా త్వరలో విడుదల కానుంది. మరోవైపు రానా దగ్గుబాటి పవన్ కళ్యాణ్‌తో కలిసి ‘భీమ్లా నాయక్’ సినిమా చేస్తున్నారు.ఈ సినిమాలో పవర్ఫుల్ మిలిటరీ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. దాంతో పాటు బాలీవుడ్లో పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటించనున్నట్టు సమాచారం.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.