హోమ్ /వార్తలు /సినిమా /

Tollywood Drug Case : " అతనో ఎవరో నాకు తెలియదు " .. ముగిసిన ఛార్మీ విచారణ..

Tollywood Drug Case : " అతనో ఎవరో నాకు తెలియదు " .. ముగిసిన ఛార్మీ విచారణ..

Charmy kaur (Twitter)

Charmy kaur (Twitter)

Tollywood Drug Case : ఉదయం మొదలైన విచారణ ఏకధాటిగా కొనసాగింది. కాసేపటి క్రితమే ఛార్మీ విచారణ పూర్తయ్యింది. విచారణలో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు అన్ని విధాలా సహకరిస్తానని ఆమె తెలిపారు.

టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన డ్రగ్స్‌ కేసు (Tollywood Drug Case) విచారణ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా మనీ లాండరింగ్ చట్టం కింద టాలీవుడ్‌కు చెందిన 12 మందికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే దర్శకుడు పూరి జగన్నాథ్‌ (Puri jagannadh)ను ఈడీ ప్రశ్నించగా.. ఈరోజు ప్రముఖ నటి, నిర్మాత ఛార్మి (Charmi)ని ఈడీ అధికారులు విచారించారు. ఉదయం మొదలైన విచారణ ఏకధాటిగా కొనసాగింది. కాసేపటి క్రితమే ఛార్మీ విచారణ పూర్తయ్యింది. విచారణలో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు అన్ని విధాలా సహకరిస్తానని ఆమె తెలిపారు. ఈడీ అధికారులు అడిగిన అకౌంట్ల వివరాలు ఇచ్చానని ఛార్మీ చెప్పారు. కెల్విన్ ఎవరో తనకు తెలియదని ఆమె ఈడీ అధికారులకు తెలిపారు.

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో రెండో రోజు విచారణలో భాగంగా సినీ నటి ఛార్మీని ఈడీ అధికారులు ప్రశ్నించారు. విచారణ ముగిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అధికారులకు కీలక డాక్యుమెంట్లు అందజేసినట్లు ఛార్మీ చెప్పారు. విచారణలో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు అన్ని విధాలా సహకరిస్తానని ఆమె తెలిపారు. ఈడీ అధికారులు అడిగిన అకౌంట్ల వివరాలు ఇచ్చానని ఛార్మీ చెప్పారు.

అయితే, విచారణ సందర్భంగా ఆమెకు సంబంధించిన రెండు బ్యాంక్ ఖాతాల లావాదేవీలను పరిశీలించారు ఈడీ అధికారులు. 2016లో కెల్విన్‌తో మాట్లాడిన కాల్ డేటా.. వాట్సాప్ ఛాట్‌ను ఛార్మీకి చూపిన అధికారులు దాదా పేరుతో ట్రాన్స్‌ఫర్ అయిన లక్షల రూపాయల లావాదేవీలపై ప్రశ్నించారు. అయితే కెల్విన్ ఎవరో తనకు తెలియదని ఛార్మీ ఈడీ అధికారులకు చెప్పారు. కెల్విన్‌తో పాటు మరో ముగ్గురి ఫోటోలను ఛార్మీకి చూపిన అధికారులు వారితో జరిగిన లావాదేవీలపై ఆమెను ప్రశ్నించారు.

ఇక ఈ కేసులో 12 మంది సినీ ప్రముఖులను ఈడీ అధికారులు విచారించనుండగా, తొలిరోజున దర్శకుడు పూరీ జగన్నాథ్ ఈడీ విచారణకి హాజరయ్యారు. ఇప్పటికే ఈ కేసులో 12 మంది సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి : విరాట్ కోహ్లీ తనకున్న ఈగో వల్లే అశ్విన్ ను పక్కన పెడుతున్నాడా..!

ఈ జాబితాలో పూరీ జగన్నాథ్‌తో పాటు నటుడు రానా దగ్గుబాటి, నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌, నిర్మాత చార్మి, నటుడు రవితేజ, నవ్‌దీప్‌, ముమైత్‌ ఖాన్‌, తనీష్‌, తరుణ్‌, నందులు ఉన్నారు.

వీరితో పాటు ఈ విచారణకు రవితేజ డ్రైవర్‌ శ్రీనివాస్‌, ఎఫ్‌ క్లబ్‌ జనరల్‌ మేనేజర్‌ కూడా రానున్నారు. ఈడీ విచారణకు హాజరుకానున్న ప్రముఖుల విచారణ తేదీలు ఇలా ఉన్నాయి.

పూరి జగన్నాథ్‌ - ఆగస్టు 31, ఛార్మి - సెప్టెంబర్‌ 2, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ - సెప్టెంబర్‌ 6, రానా దగ్గుబాటి - సెప్టెంబర్‌ 8, రవితేజ - సెప్టెంబర్‌ 9, శ్రీనివాస్‌ - సెప్టెంబర్‌ 9, నవదీప్‌ - సెప్టెంబర్‌ 13, ఎఫ్‌ క్లబ్‌ జనరల్ మేనేజర్ - సెప్టెంబర్‌ 13, ముమైత్‌ ఖాన్‌ - సెప్టెంబర్‌ 15, తనీష్‌ - సెప్టెంబర్‌ 17, నందు - సెప్టెంబర్‌ 20, తరుణ్‌ - సెప్టెంబర్‌ 22న విచారణకు హాజరు కానున్నారు.

First published:

Tags: Charmi kaur, Tollywood heroine, Tollywood news

ఉత్తమ కథలు