Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: July 5, 2020, 2:25 PM IST
నయనతార (Nayanthara)
నయనతారను చూస్తుంటే ఎందుకు భయం.. ఆమె లాంటి నటి సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎవరూ లేరు కదా.. అలాంటి నటిని ఎప్పుడెప్పుడు తమ సినిమాల్లో తీసుకోవాలా అని ఎదురు చూస్తుంటారు దర్శకులు.. మరి ఎందుకు భయపడుతున్నారు అనుకుంటున్నారా..? ఏమో ఇప్పుడు ఇలాంటి వార్తలే వినిపిస్తున్నాయి ఇండస్ట్రీలో. ముఖ్యంగా నయన్ అంటేనే నిర్మాతలతో పాటు దర్శకులు కూడా కాస్త వెనకడుగు వేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దానికి కొన్ని కారణాలు కూడా లేకపోలేవు. నయనతార రూల్స్ కాస్త కఠినంగా ఉంటాయి. ఆమెకు హీరో ఎవరనేది సంబంధం లేదు.. అంతా ఆమె చెప్పినట్లుగా జరగాలి అనే ఓ పద్దతి ఉంటుంది.

నయనతార Twitter Photo
ముఖ్యంగా డేట్స్ విషయంలో కూడా చాలా పక్కాగా ఉంటుంది.. ప్రమోషన్ అనేది అస్సలు నయన్ డిక్షనరీలోనే లేని అంశం. పైగా అందరికంటే రెమ్యునరేషన్ కూడా చాలా ఎక్కువ. మిగిలిన హీరోయిన్ల కంటే దాదాపు 3 కోట్ల వరకు అదనంగా తీసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే నయన్ అంటే వణికిపోతున్నారు మన దర్శక నిర్మాతలు అనే ప్రచారం ఈ మధ్య టాలీవుడ్లో ఎక్కువగా జరుగుతుంది. ఆ మధ్య వెంకటేష్ హీరోగా వచ్చిన బాబు బంగారం సినిమా సమయంలో తమ షూటింగ్‌కు నయనతార సరిగ్గా సహకరించడం లేదంటూ దర్శకుడు మారుతి సంచలన కమెంట్స్ చేసాడు. ఆ తర్వాత నయన్ దీనిపై క్లారిటీ ఇచ్చింది.

నయనతార ఫైల్ ఫోటో
తాను ఇచ్చిన డేట్స్ వాళ్లు యూజ్ చేసుకోలేదని.. తానేం చేయలేనని చెప్పేసింది. ఓ పాట తీయడానికి చాలా చుక్కలు చూపించిందని అప్పట్లో వార్తలొచ్చాయి. ఇక మరో సీనియర్ హీరోతో నటించేటప్పుడు కూడా ఎక్కువగా ముట్టుకోరాదనే చిత్రమైన కండీషన్ పెట్టిందని తెలుస్తుంది. మొన్నటికి మొన్న సైరా సినిమా సమయంలో ఒక్కటంటే ఒక్కసారి కూడా ప్రమోషన్‌కు రాకపోయేసరికి చిరంజీవికి చిరాకు వచ్చింది. నయన్ పేరెత్తకుండా తమన్నాను మునగచెట్టెక్కించాడు మెగాస్టార్. అందుకే నయనతార అంటే అమ్మో ఎందుకులే లేనిపోని తలనొప్పులు అంటూ తగ్గుతున్నారు దర్శక నిర్మాతలు. తమిళనాట కూడా గతంతో పోలిస్తే ఇప్పుడు నయనతారకు అంత క్రేజ్ కనిపించడం లేదు. ఫ్రస్తుతం బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా ఓ సినిమా చేస్తుంది నయన్.
Published by:
Praveen Kumar Vadla
First published:
July 5, 2020, 2:25 PM IST