HOME » NEWS » movies » TOLLYWOOD DIRECTOR TRIVIKRAM SRINIVAS TOUCHES PRODUCER SRAVANTI RAVI KISHORE FEET IN RED PRE RELEASE EVENT PK

Trivikram Srinivas: అంతా చూస్తుండగానే కన్నీళ్ళతో ఆ నిర్మాత కాళ్లపై పడిన త్రివిక్రమ్..

Trivikram Srinivas: త్రివిక్రమ్ శ్రీనివాస్.. పరిచయం అవసరం లేని పేరు. సినిమా అంటే దర్శకుడు, హీరో అని మాత్రమే తెలిసి ఉన్న కోట్లాది మందికి రైటర్ కూడా ఉంటాడు అని గుర్తు చేసిన పేరు. సినిమాకు దర్శకుడు మాత్రమే కాదు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 13, 2021, 7:45 PM IST
Trivikram Srinivas: అంతా చూస్తుండగానే కన్నీళ్ళతో ఆ నిర్మాత కాళ్లపై పడిన త్రివిక్రమ్..
త్రివిక్రమ్ స్రవంతి రవికిషోర్ (Trivikram Srinivas)
  • Share this:
త్రివిక్రమ్ శ్రీనివాస్.. పరిచయం అవసరం లేని పేరు. సినిమా అంటే దర్శకుడు, హీరో అని మాత్రమే తెలిసి ఉన్న కోట్లాది మందికి రైటర్ కూడా ఉంటాడు అని గుర్తు చేసిన పేరు. సినిమాకు దర్శకుడు మాత్రమే కాదు.. అతడు మ్యాజిక్ చేయాలంటే వెనక రచయిత కలం ఉంటుంది.. రైటర్ అనే వాడు మాటలు రాయకపోతే సినిమాకు అంత క్రేజ్ రాదని నిరూపించిన పేరు. త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు స్క్రీన్ పై కనిపిస్తే చాలు డైలాగులు గుర్తు పెట్టుకుని మరీ పదేళ్ళ తర్వాత కూడా చెప్తుంటారు. అది త్రివిక్రమ్ పెన్ పవర్. అప్పుడెప్పుడో 20 ఏళ్ల కింద వచ్చిన స్వయంవరం నుంచి నిన్నటి అల వైకుంఠపురములో వరకు త్రివిక్రమ్ జర్నీ అద్భుతమే. అలాంటి దర్శకుడు ఇప్పుడు అంతా చూస్తుండగానే స్టేజీపై ఓ నిర్మాత కళ్లు పట్టుకున్నాడు. ఇదంతా రామ్ హీరోగా నటించిన రెడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చాడు త్రివిక్రమ్. ఈ సందర్భంగా నిర్మాత స్రవంతి రవికిషోర్ గురించి మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయిపోయాడు. కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చేసాడు. స్రవంతి రవికిషోర్‌తో ఆయనకు ఉన్న బంధాన్ని గుర్తు చేసుకున్నాడు త్రివిక్రమ్.

trivikram srinivas,trivikram srinivas twitter,trivikram srinivas sravanthi ravi kishore,trivikram srinivas touches feet sravanthi ravi kishore,trivikram srinivas movies,trivikram srinivas ram movie,trivikram srinivas RED pre release event,telugu cinema,త్రివిక్రమ్,త్రివిక్రమ్ స్రవంతి రవికిషోర్,త్రివిక్రమ్ రెడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్,నిర్మాత స్రవంతి రవికిషోర్ కాళ్లు పట్టుకున్న త్రివిక్రమ్
త్రివిక్రమ్ స్రవంతి రవికిషోర్ (Trivikram Srinivas)


ఈయనతో చాలా అనుబంధం ఉంది ఈయనకు. ఓ రకంగా చెప్పాలంటే త్రివిక్రమ్ కెరీర్ ఇంత వెలిగిపోతుందంటే దానికి పునాది వేసిన నిర్మాత ఈయనే. కెరీర్ మొదట్లోనే నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, నువ్వే నువ్వే లాంటి సినిమాలు ఇచ్చాడు స్రవంతి రవికిషోర్. దాంతో ఎన్నో ఏళ్ళ తర్వాత తనకు లైఫ్ ఇచ్చిన నిర్మాత కళ్ల ముందు కనిపించే సరికి అందరి ముందు థ్యాంక్స్ చెప్పాడు. రవికిషోర్‌ను తాను పెద్దన్నగా భావిస్తానని.. ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా కూడా ఆయనతోనే ఉంటానని చెప్పాడు.

trivikram srinivas,trivikram srinivas twitter,trivikram srinivas sravanthi ravi kishore,trivikram srinivas touches feet sravanthi ravi kishore,trivikram srinivas movies,trivikram srinivas ram movie,trivikram srinivas RED pre release event,telugu cinema,త్రివిక్రమ్,త్రివిక్రమ్ స్రవంతి రవికిషోర్,త్రివిక్రమ్ రెడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్,నిర్మాత స్రవంతి రవికిషోర్ కాళ్లు పట్టుకున్న త్రివిక్రమ్
త్రివిక్రమ్ స్రవంతి రవికిషోర్ (Trivikram Srinivas)


ప్రేక్షకులకు మంచి కథలు అందించాలన్న ఆయన తపన తనకు ఎంతో నచ్చుతుందని చెప్పుకొచ్చాడు. ఇండస్ట్రీలో స్క్రిఫ్ట్‌ను అంత బలంగా చదివే వ్యక్తులను ఇద్దర్నే చూసానని.. రామానాయుడు తర్వాత స్రవంతి రవికిషోర్‌నే చూసానంటున్నాడు త్రివిక్రమ్. తన కెరీర్‌లో అంత సాయం చేసిన ఈ నిర్మాతకు అంతా చూస్తుండగానే స్టేజీపై కన్నీళ్ళతో పాదాభివందనం చేసాడు మాటల మాంత్రికుడు. ఆ తర్వాత రామ్‌ను దగ్గర తీసుకుని నువ్వు ఇంకా ఎదగాలి అంటూ ఆశీర్వదించాడు.
Published by: Praveen Kumar Vadla
First published: January 13, 2021, 7:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading