హోమ్ /వార్తలు /సినిమా /

Trivikram Srinivas: ప్రతినెల ఆ ఇంటికి త్రివిక్రమ్ రూ.5 వేలు కడుతాడు.. ఎందుకో తెలుసా?

Trivikram Srinivas: ప్రతినెల ఆ ఇంటికి త్రివిక్రమ్ రూ.5 వేలు కడుతాడు.. ఎందుకో తెలుసా?

Trivikram Srinivas

Trivikram Srinivas

Trivikram Srinivas: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించి స్టార్ డైరెక్టర్ గా ఎంతో మంచి పేరును సంపాదించుకున్నారు.

  Trivikram Srinivas: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించి స్టార్ డైరెక్టర్ గా ఎంతో మంచి పేరును సంపాదించుకున్నారు.అందరికీ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలలోకి వచ్చిన తర్వాత స్టార్ డైరెక్టర్ గా మాత్రమే తెలుసు. కానీ అతను సినిమాలలోకి రాకముందు ఏ విధమైనటువంటి కష్టాలను ఎదుర్కొన్నాడు, సినిమాల్లోకి రావడానికి ఎలా కష్టపడ్డాడు అనే విషయాలు కేవలం నటుడు కమెడియన్ సునీల్ కు మాత్రమే తెలుసు. సునీల్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇద్దరు మంచి స్నేహితులు. వీరిద్దరూ సినిమాలలోకి రాకముందు ఒకే రూమ్ లో కలిసి ఉంటూ సినిమా ప్రయాణం కొనసాగించారు. వీరిద్దరితో పాటు దర్శకుడు దశరథ్ కూడా వీరి రూమ్ లోనే ఉండేవారు.

  ఈ విధంగా పంజాగుట్టలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని ఆ ఇంటి నుంచి వీరి సినిమా ప్రయాణాలను కొనసాగించారు. ఈ క్రమంలోనే రచయితగా మంచి దర్శకుడిగా ఇండస్ట్రీల గొప్ప పేరును సంపాదించుకోవడమే కాకుండా సునీల్ కూడా మంచి కమెడియన్ నుంచి హీరో స్థాయికి ఎదిగారు. ఇలా ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ డమ్ సంపాదించుకొన్నప్పటికీ త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఆ ఇంటి పైన ఎంతో మమకారం ఉంది.

  ఇప్పటికీ ఆ ఇంటిలో వీరు నివసించి, ఈ ముగ్గురు కలిసి గడిపిన అనుభవాలను నెమరు వేసుకుంటూ ఉంటారు. ఇదిలా ఉండగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ ఇంటి పై ఉన్న జ్ఞాపకాలను వదులుకోలేక ఇప్పటికీ ఆ ఇంటికి ప్రతినెల ఐదువేల రూపాయలను అద్దె చెల్లిస్తున్నారు. అసలు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటికి కూడా ఆ ఇంటికి ఎందుకు అత్త చెల్లిస్తున్నారు అనే విషయానికి వస్తే...

  ఆ ఇంటిలో ఉంటూ సినిమా ఇండస్ట్రీలో అవకాశాలకోసం వెతికి ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ ఇంటిని మర్చిపోలేక ఇప్పటికీ ఆ ఇంట్లో కూర్చుని తన సినిమాలకు కథలు, మాటలు రాస్తున్నారు. ఈ విధంగా ఇండస్ట్రీలో చాలా మందికి చాలా సెంటిమెంట్స్ ఉంటాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ కి కూడా ఈ ఇంటిలో కూర్చుంటే కథలు రాయడం ఎంతో సులభంగా ఉంటుందని, అందుకే ఆ ఇంటికి ఇప్పటికే అద్దె చెల్లిస్తూ అక్కడే సినిమా కథలు రాస్తారని తెలియజేశారు.

  Published by:Navya Reddy
  First published:

  Tags: Ala vaikuntapuramulo, Comedian Sunil, Director trivikram srinivas, Hyderabad, Tollywood

  ఉత్తమ కథలు