త్రివిక్రమ్ కాపీ క్యాటా ?.. మాటల మాంత్రికునిపై సోషల్ మీడియాలో ట్రోల్స్..

త్రివిక్రమ్ మాటల్లల్లనే కాదు...చేతల్లో గూడా మాంత్రికుడే అని చాలా మందికి తెలియదు. ఎందుకంటే హాలీవుడ్ సీన్లను మాయం కాపీ చేసి..తన సిన్మాల పేస్ట్ చేసుకుంటా..ఆడియొన్స్ తోని విజిల్స్  కొట్టించుకునుడు త్రివిక్రమ్‌కు పెన్నుతో పెట్టిన విద్య. తాజాగా ఈయనపై సోషల్ మీడియాలో కొంత మంది సినీ అభిమానులు ట్రోల్ చేస్తున్నారు.

news18-telugu
Updated: February 17, 2020, 3:48 PM IST
త్రివిక్రమ్ కాపీ క్యాటా ?.. మాటల మాంత్రికునిపై సోషల్ మీడియాలో ట్రోల్స్..
త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫైల్ ఫోటో
  • Share this:
త్రివిక్రమ్ మాటల్లల్లనే కాదు...చేతల్లో గూడా మాంత్రికుడే అని చాలా మందికి తెలియదు. ఎందుకంటే హాలీవుడ్ సీన్లను మాయం కాపీ చేసి..తన సిన్మాల పేస్ట్ చేసుకుంటా..ఆడియొన్స్ తోని విజిల్స్  కొట్టించుకునుడు త్రివిక్రమ్‌కు పెన్నుతో పెట్టిన విద్య. ఈ మాటల మాంత్రికుడు తీసిన చాలా సినిమాలు కూడా ఏదో ఒక హాలీవుడ్ సినిమానో.. లేకపోతే పాత తెలుగు సినిమాల లైన్‌‌ను యాజిటీజ్‌‌గా తన సినిమాల్లో దింపేస్తాడనే పేరు ఉంది. తాజాగా ఈయన అల్లు అర్జున్‌తో తెరకెక్కించిన ‘అల వైకుంఠపురములో’ సినిమా కూడా వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా అప్పటి ఎన్టీఆర్ ‘ఇంటి గుట్టు’, మంచి మనిషి  సినిమాల కాన్సెప్టునే ‘అల వైకుంఠపురములో’ సినిమా కోసం వాడుకున్నాడు. అప్పటి సినిమాలను ఇప్పటి జనరేషన్‌కు అంతగా తెలియదనే ఉద్దేశ్యంతో త్రివిక్రమ్ .. ఈ కాపీ చౌర్యానికి పాల్పడ్డాని అందరు చెప్పుకున్నారు. పాత సినిమాల కాన్సెప్ట్‌‌తో కొత్త సినిమా కోసం వాడుకోవడం అనేది ఒక్క త్రివిక్రమ్ మాత్రమే కాదు.. రాజమౌళి, పూరీ జగన్నాథ్ వంటి దర్శకులు కూడా తమ సినిమాల్లో ఎన్నో సీన్లను,కథలను వేరే సినిమాల నుంచి  కాపీ పేస్ట్ చేసినవారే. ఈ కాపీ పేస్ట్ అనే కంటే ప్రేరణ తీసుకొని తీసారని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. 

Ala Vaikuntapurramuloo movie 2nd day Worldwide Collections and Allu Arjun scores big at Box Office,ala vaikunthapurramuloo,ala vaikunthapurramuloo 2nd day collections,ala vaikunthapurramuloo 2nd day world wide collections,allu arjun,allu arjun ala vaikunthapurramuloo,ala vaikunthapurramuloo,ala vaikuntapurramuloo,ala vaikunthapurramulo 1st day collections,ala vaikunta puram lo,ala vaikunthapurramulo 1st day worldwide collections,ala vaikuntapuram lo songs,ala vaikuntapuramlo,ala vaikunthapurramuloo day 1 collections report,ala vaikunthapurramuloo songs,alavaikunthapurramloo 1st day collections,allu arjun about ala vaikuntapuram lo movie,ala vaikunta puram lo songs,telugu cinema,అల వైకుంఠపురములో,అల వైకుంఠపురములో కలెక్షన్స్,అల వైకుంఠపురములో తొలిరోజు వసూళ్లు,తెలుగు సినిమా,అల వైకుంఠపురములో 2 రోజుల కలెక్షన్స్,అల వైకుంఠపురములో కలెక్షన్స్
‘అల వైకుంఠపురములో’ కలెక్షన్స్ (Twitter/Photo)


త్రివిక్రమ్ గత సినిమాల విషయానికొస్తే.. ‘అ..ఆ’ సినిమా కృష్ణ, విజయ నిర్మల హీరో, హీరోయిన్లుగా నటించిన ‘మీనా’ సినిమాను దాదాపు రీమేక్ చేసాడనే చెప్పాలి. మహేష్ బాబుతో చేసిన ‘అతడు’ సినిమా కూడా వెంకటేష్ ‘వారసుడొచ్చాడు’ సినిమాను అటు ఇటు కొంచెం మార్పులు చేసి తెరకెక్కించాడు. ఇక అల్లు అర్జున్ ‘జులాయి’ సినిమాలోని బ్యాంక్ దొంగతనం సీన్.. ’ది డార్క్ నైట్’ అనే ఫేమస్ హాలీవుడ్ సినిమాను ఎత్తశాడు. అటు అత్తారింటికీ దారేదిలో బ్రహ్మి అబద్ధం చెబితే.. ఆకులు రాలే సీన్ ఉంటది గదా. ఆ కామెడీ సీన్ ని ‘ఏ థౌసండ్ వర్డ్స్’అనే సినిమా నుంచి ఆ సీన్ ను కాపీ పేస్ట్ చేసాడు. మొత్తంగా ప్రతి సినిమాలో ఏదో ఒక హైలెట్ సీన్2ను కాపీ కొట్టి తన సినిమా స్క్రీన్ ప్లే కలిపేయడం త్రివిక్రమ్‌కు పెన్నుతో పెట్టిన విద్యగా మారింది.  

ala vaikunthapurramloo movie story inspired by sr ntr one of the super hit movie here are the details,Allu Arjun Ala Vaikuntapuramuloo inspired by Ntr Inti guttu,allu arjun,ala vaikunthapurramuloo,ala vaikuntapuramuloo,ala vaikuntapuramlo,ala vaikunthapurramuloo songs,allu arjun new movie,allu arjun new song,ala vaikuntapuram lo songs,ala vaikuntapuramlo songs,ramuloo ramulaa allu arjun,ala vaikuntapuram song,allu arjun songs,allu arjun alaa vaikuntapuramlo new song update,ala vaikuntapuram lo song,ala vaikunta puram lo songs,ala vaikuntapuram lo first song,ala vaikunthapuramulo,ala vaikunthapuramulo movie,ala vaikunthapuramulo shooting,allu arjun ala vaikunthapuramulo,ala vaikunthapuramulo dubbing work,ala vaikunthapuramulo sushanth dubbing started,ala vaikunthapuramulo movie shooting,ala vaikunthapuramulo allu arjun pooja hegde,ala vaikunthapuramulo trivikram srinivas,telugu cinema,అల్లు అర్జున్,అల వైకుంఠపురములో,అల వైకుంఠపురములో అల్లు అర్జున్ పూజా హెగ్డే,అల్లు అర్జున్ సుశాంత్,తెలుగు సినిమా,అల వైకుంఠపురములో డబ్బింగ్ మొదలు,అల వైకుంఠపురములో
ఎన్టీఆర్ ‘ఇంటిగుట్టు’ అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ సినిమా (youtube/Credit)


తాజాగా అల్లు అర్జున్‌తో తెరకెక్కించిన ‘అల వైకుంఠపురములో’ సినిమా విషయంలో త్రివిక్రమ్‌కు కొత్త చిక్కు వచ్చి పడింది. త్రివిక్రమ్ ఈ సినిమా స్టోరీని కృష్ణ అనే దర్శకుడి దగ్గర నుండి త్రివిక్రమ్ కథను కాపీ కొట్టాడని అందుకే ఆ దర్శకుడు త్రివిక్రమ్‌కు లీగల్ నోటీసులు ఇవ్వాలనుకుంటున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కృష్ణ.. 2013లోనే ఈ కథను రాసి ఫిల్మ్ ఛాంబర్‌లో రిజిస్టర్ చేయించాడట. స్క్రిప్ట్ పేజీని డైరెక్టర్ త్రివిక్రమ్‌కి ఇచ్చి ‘దశ.. దిశ’ టైటిల్‌తో సినిమా తీయాలనుకుంటున్నట్టు చెప్పాడట. ఆ తర్వాత త్రివిక్రమ్.. అదే స్టోరీని ‘అల వైకుంఠపురములో’ సినిమా తీశాడని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై త్రివిక్రమ్‌తో పాటు చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: February 17, 2020, 3:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading