Tharun Bhascker: తెలుగు సినీ నటి, డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి గురించి తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమే. మంచు ఫ్యామిలీ నుండి తొలి హీరోయిన్ గా అడుగుపెట్టిన మంచు లక్ష్మి పలు సినిమాలలో నటించింది. కానీ అంత సక్సెస్ అందుకోలేక ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలువలేకపోయింది. ఇక నిర్మాతగా కూడా చేసింది. సోషల్ మీడియాలో బాగా ఫోటోలను, వీడియోలను పంచుకుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా మంచు లక్ష్మి ఓ పొరపాటు చేసింది.
ఇంగ్లీష్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మంచు లక్ష్మి అనగనగా ఓ ధీరుడు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత పలు సినిమాలలో నటించింది. బుల్లితెరలో కూడా కొన్ని షోలలో వ్యాఖ్యాతగా కూడా చేసింది. ప్రస్తుతం ఆహాలో ఆహా భోజనంబు అంటూ వంటల ప్రోగ్రాం ను కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ రెండు ఎపిసోడ్ లను కూడా పూర్తి చేసింది. మొదటి రెండు ఎపిసోడ్ లలో విశ్వక్ సేన్, రకుల్ ప్రీత్ పాల్గొని బాగా సందడి చేశారు. ఇక తాజాగా మూడో ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదలయింది.
ఇందులో తరుణ్ భాస్కర్ పాల్గొనగా ప్రోమో మొత్తం బాగా సందడిగా సాగింది. ఇక మంచు లక్ష్మి తనను తన ఇన్ స్టా గ్రామ్ లో కేవలం తయారుచేసిన ఫోటోలు మాత్రమే పెడతావని.. వండిన డిష్ లను ఎందుకు పెట్టావ్ అని ప్రశ్నించగా.. అదంతా చెత్తగా ఉంటుందని.. తను వంట చేసిన తర్వాత అక్కడున్న వాటిని చూస్తే తింటారా లేదా అన్నట్లు ఉంటాయని.. అదే విధంగా తనకు కామెంట్స్ కూడా అలాగే వస్తాయని చెప్పడంతో బాగా ఫన్నీ క్రియేట్ అయింది.
View this post on Instagram
ఇక మోహన్ బాబు తన తాత గురించి తనతో మాట్లాడినప్పుడు తనకు చేతులు వణికాయని తెలిపాడు. ఇక ఈ రోజు తను చక్కెర పొంగలి చేస్తున్నానని అన్నాడు. ఇక చక్కెర పొంగితేనే చక్కెర పొంగలి అంటారని జోక్ వేశాడు తరుణ్. అలా వంట చేస్తూ కాస్త ఫన్నీ జోక్స్ కూడా వేశాడు తరుణ్. అతను చేసిన వంట గురించి మంచు లక్ష్మి ఓ కామెంట్ చేస్తూ.. ఇప్పుడు అసలైన టేస్ట్ వస్తుందని.. వేరే వంటలో చక్కెర పొంగలి స్పూన్ తో కలిపి పొరపాటు పడింది. అలా ప్రోమో మొత్తం బాగా సరదాగా ఉండగా.. ఈ ప్రోమో నెట్టింట్లో వైరల్ గా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aha bojanambu, Manchu Lakshmi, Tharun Bhascker, Tollywood