Home /News /movies /

TOLLYWOOD DIRECTOR TEJA SENSATIONAL COMMENTS ON MOVIE FUNCTIONS SB

సినిమా ఫంక్షన్లకు వెళ్లి భజనలు చేయలేను... ప్రముఖ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తనకు తాగడం, తినడం అలవాటు లేదని... అమ్మాయిల కోసం కూడా పార్టీలకు వెళ్లనన్నారు. స్టేజ్‌లు ఎక్కి వాడిని వీడిని పొగడాలంటే తనవల్ల కాదంటూ.. కీలక వ్యాఖ్యలు చేశారు.

    సినీ ఇండస్ట్రీ పూర్తిగా మారింది. సినిమా విడుదలయ్యాక..  ఒకప్పుడు వందరోజులు... 50 రోజుల ఫంక్షన్లు జరుగుతుండేవి. అది కూడా పెద్ద పెద్ద హీరోల సినిమాలు అయితేనే.. ఆ సమయంలోనే హీరోలు చాలా అరుదుగా వేదికలపైన మాట్లాడుతుండేవాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితి చాలా మారిపోయింది. సినిమా స్టార్టింగ్ అయిన దగ్గర నుంచి వరుసగా వేడుకలే నిర్వహిస్తారు. ప్రిరిలీజ్ అంటూ.. సక్సెస్ మీట్‌లు అంటూ... వరుసగా ఫంక్షన్లు నిర్వహిస్తున్నారు. ఇక ఈ వేడుకకు ప్రముఖ అతిథులుగా సిని ఇండస్ట్రీకి చెందిన హీరోలను, డైరెక్టర్లను పిలుస్తూ ఉంటారు.

    తాజాగా ఇలాంటి ఫంక్షన్ల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు ప్రముఖ డైరెక్టర్ తేజ. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తేజ ప్రస్తుతమున్న సినిమా ఇండ్ట్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఇక్కడ ఉండే ట్రేడిషన్స్, పద్దతులు వీటిన్నంటికి మీరు దూరంగా ఎందుకు ఉంటారు అన్న ప్రశ్నకు తేజ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. సినిమా ఫంక్షన్లు, పార్టీలకు వెళ్లకపోవడం  మీ క్యారెక్టర్‌లో భాగమా.. మీ పొగర్లో భాగమా అని తేజకు యాంకర్  ప్రశ్న వేశారు.


    దానికి సమాధానం ఇస్తూ... పార్టీకి వెళ్తే బోరు కదండి... నేను తాగను ,సిగరేట్ కాల్చాను, అమ్మాయిల కోసం వెళ్లను. తినను. ఇక ఏం చేస్తా.. తిండిమీద ఇంట్రస్ట్ లేదు.సినిమా అంటేనే ఇంట్రస్ట్ అన్నారు తేజ. అందుకే పార్టీకి వెళ్లనన్నారు తేజ. పార్టీకి వెళ్తే.. వాడికి వీడికి షేక్ హ్యాండ్లు ఇవ్వాలి. నవ్వాలి. మనకు ఇష్టం లేకపోయిన నవ్వాలి. అది నా వల్ల కాదు. ఫంక్షన్లకు వెళ్తే.. మైక్ ఇస్తారో మైక్ పట్టుకొని భజన కొట్టాలి. ఈయన గ్రేట్ ఆయన గ్రేట్ అని చెప్పాలి. అది నా వల్ల కాదు. అబద్ధాలు ఆడలేను. బాగులేకుంటే బాగలేదంటాను. సినిమా చూసి నచ్చకపోతే నచ్చలేదని చెబుతాను అన్నారు తేజ.

    ఇక తేజ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు కూడా అదే రేంజ్‌లో ఆడుకుంటున్నారు. అందుకే నువ్వు ఇప్పుడు ఈ స్టేజ్‌లో ఉన్నావు అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొందరు ఆయనపై జూనియర్ ఆర్జీవీ అంటూ.. సెటైర్లు వేస్తున్నారు. ‘వీడికి షో ఎక్కువ. వీడకంటే పెద్ద డైరెక్టర్లు ఉన్నారు. అందరూ కలుస్తూనే ఉంటారు’ అంటూ మరో నెటిజన్ పోస్టు పెట్టారు.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Teja, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు