3 కాకపోతే 30 రాజధానులు పెట్టుకో.. జగన్‌పై ఆ దర్శకుడి సెటైర్..

ఏపీ సీఎం వైఎస్ జగన్

YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని నెలలుగా రాజధానుల విషయం కీలకంగా జరుగుతుంది. అమరావతి నుంచి కాదని మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చాడు సిఎం జగన్. దీనిపై కొందరు సమర్థిస్తున్నారు.. మరికొందరు విమర్శిస్తున్నారు.

  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని నెలలుగా రాజధానుల విషయం కీలకంగా జరుగుతుంది. అమరావతి నుంచి కాదని మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చాడు సిఎం జగన్. దీనిపై కొందరు సమర్థిస్తున్నారు.. మరికొందరు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా రైతులను అన్యాయం చేస్తావా అంటూ పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు అయితే ఢిల్లీ స్థాయిలో రచ్చ చేస్తున్నారు. ఇక తెలుగుదేశం కూడా జగన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తుంది. ఇలాంటి సమయంలో ఇండస్ట్రీ నుంచి మాత్రం చాలా మంది జగన్ నిర్ణయానికి సపోర్ట్ చేస్తున్నారు. సాక్షాత్తు మెగాస్టార్ చిరంజీవి వెళ్లి జగన్‌ను స్వయంగా కలిసి మూడు రాజధానుల నిర్ణయంపై సమర్థించాడు. బయటికి వచ్చి ప్రశంసించాడు కూడా. అయితే ఇప్పుడు దీనిపై టాలీవుడ్ సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేసాడు.
ఏపీ మూడు రాజధానుల విషయంపై జగన్‌తో విభేదించిన తమ్మారెడ్డి (AP CM YS Jagan Tammareddy Bharadwaja)
ఏపీ మూడు రాజధానుల విషయంపై జగన్‌తో విభేదించిన తమ్మారెడ్డి (AP CM YS Jagan Tammareddy Bharadwaja)

విశాఖపట్నంలో ఈయన మాట్లాడుతూ జగన్‌కు సెటైర్లు వేసాడు. 3 కాకపోతే 30 రాజధానులు పెట్టుకోండని తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. ఎక్కడి నుంచి పాలన జరిగితే అదే రాజధాని అవుతుందని ఆయన చెప్పారు. కొత్తగా పేరు పెట్టినంత మాత్రాన అది రాజధాని కాదని.. అలాంటివి ఎప్పటికీ రాజధానులు కాలేవని చెప్పారాయన. మంచికో, చెడుకో అమరావతి రాజధాని అంటూ సుమారుగా ప్రజాధనం 7 వేల కోట్లు పెట్టారని.. అయితే మరో 2 వేల కోట్లు ఖర్చు పెడితే అది పూర్తవుతుందని తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. కానీ ఇప్పుడు మళ్లీ రాజధానులు అంటే అది ప్రజలకే కదా నష్టం అంటూ ప్రశ్నించారాయన. దీనిపై పలువురు వైసీపీ నేతలు తమ్మారెడ్డిని తప్పు పడుతున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published: