TOLLYWOOD DIRECTOR SUKUMAR INTERESTING COMMENTS ON RRR MOVIE AND PAN INDIAN DIRECTOR RAJAMOULI PK
Sukumar about RRR movie: మీకు మాకు తేడా అదే.. మీరు తీస్తారు మేం చూస్తాం.. రాజమౌళి ‘RRR’పై సుకుమార్ కామెంట్స్..
రాజమౌళిపై సుకుమార్ ప్రశంసల వర్షం (rajamouli sukumar)
Sukumar about RRR movie: ఇండస్ట్రీలో ఎవరైనా ఓ స్టార్ డైరెక్టర్ మరో దర్శకుడిని పొగడాలంటే చాలా కష్టం. దానికి ఎంత కాదన్నా కూడా ఇగో అడ్డొస్తుంది. కానీ కొందరు దర్శకులు మాత్రం తమ ఇగోను పక్కనబెట్టి మరీ పక్క దర్శకుడి గొప్పతనం గురించి గొప్పగా చెప్తుంటారు. అందులో మొదటి వాడు సుకుమార్ (Sukumar).
ఇండస్ట్రీలో ఎవరైనా ఓ స్టార్ డైరెక్టర్ మరో దర్శకుడిని పొగడాలంటే చాలా కష్టం. దానికి ఎంత కాదన్నా కూడా ఇగో అడ్డొస్తుంది. కానీ కొందరు దర్శకులు మాత్రం తమ ఇగోను పక్కనబెట్టి మరీ పక్క దర్శకుడి గొప్పతనం గురించి గొప్పగా చెప్తుంటారు. అందులో మొదటి వాడు సుకుమార్ (Sukumar). ఈయన కూడా తక్కువేం తినలేదు.. సుకుమార్ సినిమాలు కూడా పాన్ ఇండియానే. మొన్న ఈయన తెరకెక్కించిన పుష్ప (Pushpa) సినిమా 300 కోట్లకు పైగా వసూలు చేసింది. అంతకు ముందు రంగస్థలం (Rangasthalam) ఇండస్ట్రీ హిట్ అయింది. దానికి ముందు నాన్నకు ప్రేమతో (Nannaku Prematho) మంచి విజయం అందుకుంది. ఆర్య (Arya) ట్రెండ్ సెట్టర్. ఇలా సుకుమార్ చరిత్ర చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. సాక్షాత్తు దర్శక ధీరుడు రాజమౌళికి (Rajamouli) కూడా ఇష్టమైన దర్శకుడు సుకుమార్. అలాంటి దర్శకుడు ఇప్పుడు రాజమౌళిని ఆకాశానికి ఎత్తేసాడు.
ట్రిపుల్ ఆర్ (RRR) సినిమాపై ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. స్వతహాగా ఓ స్టార్ డైరెక్టర్ అయ్యుండి కూడా.. ఏ మాత్రం భేషజాలకు పోకుండా రాజమౌళితో పాటు ట్రిపుల్ ఆర్ సినిమాను సుకుమార్ ప్రశంసించిన తీరు చూసి అంతా ఫిదా అయిపోతున్నారు. తెలుగు ఇండస్ట్రీ గర్వించదగ్గ ఓ దర్శకుడు.. మరో దర్శకుడిని ఇలా పొగుడుతుంటే అభిమానులు కూడా పండగ చేసుకుంటున్నారు. ఇది కదా.. అసలైన మల్టీస్టారర్ కాంబినేషన్ అంటే అంటూ కాలర్ ఎగరేస్తున్నారు. ప్రేక్షకుల నాలుగేళ్ల నిరీక్షణకు తెర దించుతూ విడుదలైన ట్రిపుల్ ఆర్ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. అన్ని ఇండస్ట్రీల నుంచి కూడా ఈ సినిమాకు పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. దాంతో యూనిట్ కూడా ఖుషీగా ఉన్నారు. చిన్నా పెద్దా ముసలి మతకా తేడా లేకుండా సినిమా చూసి.. తమ రివ్యూ ఇస్తున్నారు.
తాజాగా సుకుమార్ కూడా ట్రిపుల్ ఆర్ సినిమా చూడటమే కాదు.. తన అభిప్రాయం సోషల్ మీడియా వేదికగా షేర్ చేసాడు.. అది కాస్తా ఇప్పుడు ఫేస్ బుక్‌ను షేక్ చేస్తుంది. అందులో రాజమౌళి గురించి ఆయన ఇలా రాసుకొచ్చాడు.. మీరు పక్కనే ఉన్నా మిమ్మల్ని అందుకోవాలంటే పరిగెత్తాలి.. మేం ఆకాశంలో ఉన్నా మిమ్మల్ని చూడాలంటే తలెత్తాలి.. రాజమౌళి సార్.. మీకు మాకు ఒకటే తేడా.. ఇలాంటి సినిమా మీరు తీయగలరు.. మేం చూడగలం అంతే.. సుకుమార్ అంటూ పోస్ట్ చేసాడు. ఆ మధ్య పుష్ప సినిమా విడుదలైనపుడు రాజమౌళి కూడా ఇదే స్థాయిలో సుకుమార్‌ను ప్రశంసల్లో ముంచెత్తాడు. ఏదేమైనా తెలుగు ఇండస్ట్రీ గర్వించదగ్గ ఇద్దరు అగ్ర దర్శకులు ఇలా ఒకర్నొకరు అభినందించుకుంటుంటే ఆ కిక్కే వేరప్పా.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.