Saaho - Director Sujeeth: సాహో సినిమా తీసినప్పుడు అలాంటి సమస్యను ఎదుర్కొన్న.. డైరెక్టర్ సుజిత్?

saaho sujeeth

Saaho - Director Sujeeth: సినీ ఇండస్ట్రీలో తొలిసారిగా అడుగుపెట్టాలనుకునేవాళ్లు ఏదో అవ్వాలని అనుకుంటారు. అలా కొందరు తాము అనుకున్నట్లు హీరోలు గానో లేక చిన్న చిన్న పాత్రలో గాను అవకాశాన్ని అందుకుంటారు.

  • Share this:
    Saaho - Director Sujeeth: సినీ ఇండస్ట్రీలో తొలిసారిగా అడుగుపెట్టాలనుకునేవాళ్లు ఏదో అవ్వాలని అనుకుంటారు. అలా కొందరు తాము అనుకున్నట్లు హీరోలు గానో లేక చిన్న చిన్న పాత్రలో గాను అవకాశాన్ని అందుకుంటారు. కొందరు హీరోగా తామేంటో నిరూపించాలనుకుంటారు. కానీ అందులో తమకు వ్యతిరేకం ఎదురవుతే అదే పట్టుదలతో ఇంకా ఏదైనా సాధించాలని అనుకుంటారు. ఇదిలా ఉంటే ఇండస్ట్రీకి వచ్చిన తను మొదట్లో హీరో అవ్వాలనుకున్నాడు. కానీ దర్శకుడిగా మారి తానేంటో నిరూపించుకున్నాడు. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరో కాదు.. రన్ రాజా రన్ సినిమాతో తొలిసారిగా దర్శకత్వం వహించి డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి సుజిత్.

    ఈయన దర్శకుడిగానే కాకుండా కథా రచయితగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం రెండు సినిమాలలో దర్శకత్వం వహించిన సుజిత్ తన రెండో సినిమాను మాత్రం పాన్ ఇండియా మూవీతో స్టార్ హీరో ప్రభాస్ తో తెరకెక్కించాడు. 2019లో పలు భాషలలో విడుదలైన సాహో సినిమాకు దర్శకత్వం వహించాడు సుజిత్. ఇదిలా ఉంటే ఈటీవీ ప్లస్ లో ప్రసారమవుతున్న 'నీకు మాత్రమే చెప్తా' అనే కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఇక ఇందులో దర్శకుడు తరుణ్ భాస్కర్ హోస్టింగ్ చేస్తున్నాడు. ఇందులో పాల్గొన్న సుజిత్ కొన్ని విషయాలు పంచుకున్నాడు. ఆయన మొదట హీరో అవుదామని ఇండస్ట్రీలో అడుగు పెట్టాడట. ఎన్నో ప్రయత్నాలు చేశాడట. ఎన్నో ఆడిషన్స్ కి కూడా వెళ్లేవాడట. ఇక ఆయనని అక్కడ చూసినవాళ్లంతా ' ఏదో ఉంది కానీ ఏం లేదు' అని హేళన చేశారట. ఇక అలా అన్న వాళ్లకి తను ఏంటో చూపించాలని దర్శకత్వం వైపు అడుగులు వేసాడట.

    https://youtu.be/S6XlChzfk-Q

    ​అలా తన సొంత దర్శకత్వంలో చేసినప్పుడు తను బ్యాడ్ యాక్టర్ అని, గుడ్ డైరెక్టర్ అని అప్పుడు తెలిసిందట. ఇక తన తొలి సినిమా ముందే ప్రభాస్ తో పరిచయం ఉన్నది తెలిపాడు. తను తీసిన ప్రేమ ఇష్క్ కాదల్ అనే లఘుచిత్రం ప్రభాస్ కి నచ్చడంతో తనను బాగా ప్రోత్సహించారని తెలిపాడు సుజిత్. ప్రభాస్ వల్లే తనక్ యువి క్రియేషన్స్ నిర్మాణ సంస్థ పరిచయమని తెలిపాడు. కానీ ప్రభాస్ తో ఎప్పుడు సినిమా తీసే ఆలోచన రాలేదని.. ఓసారి తన తొలి సినిమా మంచి సక్సెస్ అందడంతో ప్రభాస్ తనతో మనం ఓ చిత్రం చేద్దామని అనడంతో సీరియస్ గా తీసుకోకుండా ఓకే అన్నాడట. అలా కొంతకాలం తర్వాత తన దగ్గర ఉన్న ఒక పాయింట్ ప్రభాస్ కి చెప్పడంతో సాహో సినిమా చేశానని తెలిపారు. ఈ సినిమా వల్ల తనకు ఒత్తిడి అనిపించలేదని, ఎప్పుడు భయపడలేదని, ఎన్నో నేర్చుకున్నానని తెలిపాడు. ఈ ప్రపంచంలో తనను ఎక్కువగా ప్రభాస్ నమ్ముతాడని ఇప్పుడు ఫోన్ చేసి కథ ఉందని చెబితే వెంటనే ఓకే అంటాడని చెప్పాడు సుజిత్. ఇక ప్రభాస్ ది బెస్ట్ పర్సన్ జాబితాలో టాప్ లో ఉన్నాడని తెలిపాడు.
    Published by:Navya Reddy
    First published: