TOLLYWOOD DIRECTOR RELANGI NARASIMHA RAO REMEMBER HIS PAST ABOUT DASARI NARAYAN RAO IN ALITHO SARADAGA SHOW NR
Alitho Saradaga: దాసరి మీద దండయాత్ర చేసిన రేలంగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా?
Alitho Saradaga
Alitho Saradaga: తెలుగు సినీ స్టార్ డైరెక్టర్ రేలంగి నరసింహారావు. ఈయన ఎన్నో కామెడీ సినిమాలకు దర్శకత్వం వహించి తెలుగు సినీ చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా కొన్ని ప్రేమకథా చిత్రాల్లో కూడా దర్శకత్వం వహించి మంచి సక్సెస్ లు అందుకున్నాడు.
Alitho Saradaga: తెలుగు సినీ స్టార్ డైరెక్టర్ రేలంగి నరసింహారావు. ఈయన ఎన్నో కామెడీ సినిమాలకు దర్శకత్వం వహించి తెలుగు సినీ చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా కొన్ని ప్రేమకథా చిత్రాల్లో కూడా దర్శకత్వం వహించి మంచి సక్సెస్ లు అందుకున్నాడు. ఇక ఈయన ఎక్కువగా రాజేంద్రప్రసాద్ సినిమాలకు దర్శకత్వం వహించి అతడికి మంచి గుర్తింపును అందించాడు. ఇక ఈయన కె.ఎస్.ఆర్.దాస్, దాసరి నారాయణ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఇదిలా ఉంటే ఓసారి తన గురువు దాసరి మీదనే దండయాత్ర చేశాడట రేలంగి.
ప్రతి వారం ఈటీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా షో గురించి అందరికీ తెలిసిందే. ఇందులో ఆలీ ఎంతో మంది సెలబ్రెటీలను గెస్ట్ లుగా ఆహ్వానించి వారి గురించి తెలుసుకుంటాడు. ఇక ఈ వారం ఎపిసోడ్ పూర్తికాగా అందులో స్టార్ డైరెక్టర్ రేలంగి నరసింహారావు పాల్గొన్నాడు. తన గురించి ఎన్నో విషయాలను పంచుకున్న రేలంగి తన మాటలతో ప్రేక్షకులను తెగ నవ్వించాడు.
ఓసారి తన గురువు గారు.. తన క్లాప్ బోర్డును నేలమీద పెట్టినందుకు తనను గట్టిగా కొట్టాడట. ఇక ఈయన దాసరి నారాయణను ఒక మాట అనడంతో ఆయన రెండు గంటల వరకు అక్కడ నుంచి కదలలేదట.ఇక ఈ విషయాన్ని ఆలీ అడిగినప్పుడు అది అనుకోకుండా జరిగిందని తెలిపాడు రేలంగి. ఇక ఈయనకు ఓ విషయంలో కోపం వచ్చిందంట. కాకపెట్టే వాళ్ళందర్నీ ముందువరుసలో పెట్టాడన్న అజ్ఞానంతో.. వద్దు ఈయన దగ్గర మానేద్దామని అనుకున్నాడట. ఇక ఈ విషయాన్ని ఆయన దగ్గరికి వెళ్లి చెప్పాలని వెళ్ళాడట. ఇక ఆయన మొహం చూడకుండా ఆయన పాదాల దగ్గరికి వెళ్లి.. గురువుగారు ఎక్కడున్నా కూడా మీ శిష్యుడినే.. నీ పేరు నిలబెడతానని వస్తాను సార్ అని అన్నప్పుడు తన కళ్ళల్లో నుంచి రెండు కన్నీటి చుక్కలు పడ్డాయట.
అలా పడ్డ సంగతి తనకు తెలియలేదట. అలా తన రూమ్ లో బాధపడుతూ పడుకున్నాడట. అలా ఓ హారన్ సౌండ్ రావడంతో చూసేసరికి ఓ ప్రొడ్యూసర్ అని అతనికి దగ్గరికి వెళ్ళాడట. అతడు ఏంటి దాసరి నారాయణ మీద దండయాత్ర చేశావట అని అన్నాడట. దాంతో ఆయనెంత సార్.. ఆయనతో నేనెందుకు దండయాత్ర చేస్తాను అని అన్నాడట. అలా ఆయనతో మాట్లాడి దాసరి గురించి చెప్పడట. ఇక నువ్వు వెళ్లినప్పటి నుంచి పచ్చి మంచినీళ్లు కూడా ముట్టలేదని అనడంతో అటువంటి వ్యక్తిని వదులుకోవడం కరెక్ట్ కాదని వెళ్ళగానే తనను చూసి ఆనందంతో కడుపునిండా భోజనం చేశాడట దాసరి.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.