ఇంట్లో భార్య శవాన్ని పెట్టుకుని షూటింగ్‌కు వచ్చిన నటుడు.. 13 ఏళ్ళ తర్వాత బయటపడ్డ నిజం..

సీనియర్ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య (muthyala Subbaiah)

వినడానికే కాదు నమ్మడానికి కూడా చాలా కష్టంగా ఉండే నిజం ఇది. 13 ఏళ్ళ కింద జరిగిన ఈ నిజం ఇప్పుడు బయటికి వచ్చింది. ఓ నటుడు తన భార్య చనిపోయినా.. శవం ఇంట్లోనే ఉన్నా కూడా డేట్స్ సర్దుబాటు కావని షూటింగ్‌కు వచ్చాడు.

  • Share this:
వినడానికే కాదు నమ్మడానికి కూడా చాలా కష్టంగా ఉండే నిజం ఇది. ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ ఇరుగు పొరుగు షూటింగ్ చేస్తున్నపుడే ఆయన పెద్ద కొడుకు రామకృష్ణ చనిపోయాడని తెలుస్తుంది. అయితే ఆ రోజు షూటింగ్‌కు చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు వచ్చారని.. అందరి డేట్స్ మళ్ళీ ఒకేసారి దొరకడం కష్టమని కొడుకు చనిపోయిన బాధను దిగమింగి మరీ షాట్ పూర్తి చేసారు. అలాంటి వార్తలను అప్పుడప్పుడూ వినడమే కానీ ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ చూడలేదు. అయితే ఈ మధ్య కాలంలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. దాదాపు 13 ఏళ్ళ కింద జరిగిన ఈ నిజం ఇప్పుడు బయటికి వచ్చింది. ఓ నటుడు తన భార్య చనిపోయినా.. శవం ఇంట్లోనే ఉన్నా కూడా డేట్స్ సర్దుబాటు కావని షూటింగ్‌కు వచ్చాడు. సాయంత్రం వరకు బాధను దిగమింగుకుని షూటింగ్ అవ్వగొట్టుకున్న తర్వాతే ఇంటికి వెళ్లాడు. ఈ విషయాన్ని ఆ సినిమాను డైరెక్ట్ చేసిన సీనియర్ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

2008లో ముత్యాల సుబ్బయ్య తెరకెక్కించిన సినిమా ఆలయం. శివాజీ, లయ, బ్రహ్మానందం కీలక పాత్రల్లో నటించారు. ముత్యాల సుబ్బయ్య నుంచి వచ్చిన చివరి సినిమా కూడా ఇదే. ఆలయం తర్వాత మళ్లీ ఆయన సినిమాలు చేయలేదు. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ సమయంలో తనకు రెండు చేదు సంఘటనలు ఎదురయ్యాయని గుర్తు చేసుకున్నారు ఈయన.
Muthyala Subbaiah,Muthyala Subbaiah movies,Muthyala Subbaiah tilak actor,senior actor mbd tilak,senior actor mbd tilak wife death,senior actor mbd tilak alayam movie wife death,telugu cinema,సీనియర్ నటుడు తిలక్,ముత్యాల సుబ్బయ్య,ముత్యాల సుబ్బయ్య తిలక్ భార్య మృతి
సీనియర్ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య (muthyala Subbaiah)

అందులో ఒకటి తన తల్లి చనిపోవడం అని చెప్పిన ముత్యాల సుబ్బయ్య.. మరోటి తన సినిమాలో వేషం వేసిన సీనియర్ నటుడు తిలక్ భార్య మరణించడం అని చెప్పాడు. అయితే తిలక్ తన భార్య చనిపోయిన విషయాన్ని సెట్‌లో ఎవరికీ చెప్పలేదని.. బాధ లోపలే పెట్టుకుని షూటింగ్‌కు వచ్చి తన షాట్ అయిపోయాకే అసలు విషయం చెప్పాడని గుర్తు చేసుకున్నాడు ముత్యాల సుబ్బయ్య. సాధారణంగానే ఆయన సెట్‌లో ఎవరితోనూ మాట్లాడడు.. సైలెంట్‌గా ఉండే మనిషి కావడంతో సాయంత్రం వరకు కూడా ఆయన భార్య చనిపోయిన విషయం ఒక్కరికి కూడా తెలియలేదని చెప్పాడు ఈయన.
Muthyala Subbaiah,Muthyala Subbaiah movies,Muthyala Subbaiah tilak actor,senior actor mbd tilak,senior actor mbd tilak wife death,senior actor mbd tilak alayam movie wife death,telugu cinema,సీనియర్ నటుడు తిలక్,ముత్యాల సుబ్బయ్య,ముత్యాల సుబ్బయ్య తిలక్ భార్య మృతి
సీనియర్ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య (muthyala Subbaiah)

షూటింగ్ అయిన తర్వాత అసలు నిజం చెప్పి భోరున ఏడ్చేసాడు తిలక్. జరగాల్సిన దారుణం జరిగిపోయింది.. అక్కడుండి కూడా చేసేదేం లేదు.. ఇక్కడికి వస్తే కనీసం షూటింగ్ అయినా ఇబ్బందులు లేకుండా జరుగుతుంది కదా.. అందుకే వచ్చానని చెప్పి కన్నీరు పెట్టుకున్నాడు తిలక్. ఏదేమైనా అంత బాధను దిగమింగుకుని షూటింగ్ చేయడం అనేది చిన్న విషయం కాదు.
Published by:Praveen Kumar Vadla
First published: