హోమ్ /వార్తలు /సినిమా /

‘F2’ సీక్వెల్ ప్లాన్ చేస్తోన్న అనిల్ రావిపూడి..ఇంతకీ హీరోలెవరో తెలుసా..

‘F2’ సీక్వెల్ ప్లాన్ చేస్తోన్న అనిల్ రావిపూడి..ఇంతకీ హీరోలెవరో తెలుసా..

‘ఎఫ్ 2’ మూవీ పోస్టర్

‘ఎఫ్ 2’ మూవీ పోస్టర్

ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీస్‌లో సీక్వెల్స్ హవా నడుస్తోంది. కొత్త కథలతో కుస్తీ పట్టడం కన్నా..పాత స్టోరీలనే అటూ ఇటూ తిప్పి సీక్వెల్స్‌గా చుట్టేస్తున్నారు మన దర్శక, నిర్మాతలు. తాజాగా టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతున్న ‘ఎఫ్ 2’ సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి.

ఇంకా చదవండి ...

బాలీవుడ్‌లో గోల్‌మాల్, హౌస్‌ఫుల్, ధమాల్ వంటి కామెడీ సినిమాల సిరీస్ మాదిరిగా తెలుగులో ‘ఎఫ్2’  కామెడీ సినిమాకు సీక్వెల్స్ తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నాడు అనిల్ రావిపూడి. ‘ఎఫ్2’లో వెంకటేష్, వరుణ్ తేజ్‌లతో అనిల్ రావిపూడి ఏ రేంజ్‌లో నవ్వులు పూయించాడో తెలిసిందే కదా. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంలో అనిల్ రావిపూడి సక్సెస్ అయ్యాడు. ఈ సినిమా త్వరలో రూ.100 కోట్ల గ్రాస్‌కు చేరువలో ఉంది.

ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీస్‌లో సీక్వెల్స్ హవా నడుస్తోంది. కొత్త కథలతో కుస్తీ పట్టడం కన్నా..పాత స్టోరీలనే అటూ ఇటూ తిప్పి సీక్వెల్స్‌గా చుట్టేస్తున్నారు మన దర్శక, నిర్మాతలు. తాజాగా టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతున్న ‘ఎఫ్ 2’ సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి.
ఎఫ్2లో వెంకటేష్, వరుణ్ తేజ్

తాజాగా ‘ఎఫ్ 2’ సినిమాకు సీక్వెల్‌గా  ‘ఎఫ్ 3’ సినిమాను తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ సీక్వెల్‌ను కూడా దిల్ ‌రాజు నిర్మించే అవకాశాలున్నాయి.  ఈ సీక్వెల్‌లో వెంకటేష్, వరుణ్ తేజ్‌లకు జోడిగా రవితేజ కూడా నటించనున్నాడు. కామెడీ చేయడంలో రవితేజ స్టైల్ గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. వెంకీ, వరుణ్‌లకు తోడుగా రవితేజ యాడ్ అయితే థియేటర్స్‌లో ఏ రేంజ్‌లో నవ్వులు పూస్తాయో సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. త్వరలో ‘ఎప్ 3’ సీక్వెల్‌కు సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది.

బాలీవుడ్ హాట్ కపుల్ ఇవి కూడా చదవండి 

ఒకే ఫ్రేమ్‌లో తారక్,చరణ్, అఖిల్..పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్

ప్రారంభమైన రామ్, పూరీ జగన్నాథ్‌ల ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీ

శంకర్‌, రాజమౌళిలో ఎవరు బెస్ట్ డైరెక్టర్ ?

First published:

Tags: Anil Ravipudi, Dil raju, Ravi Teja, Telugu Cinema, Tollywood, Varun Tej, Venkatesh

ఉత్తమ కథలు