ప్రముఖ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌కు మాతృ వియోగం..

Tammareddy Bharadwaj Mother Krishnaveni | టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ద‌ర్శ‌కుడు, నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ మాతృమూర్తి కృష్ణ‌వేణి సోమ‌వారం మృతి చెందారు.

news18-telugu
Updated: April 6, 2020, 8:27 PM IST
ప్రముఖ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌కు మాతృ వియోగం..
తమ్మారెడ్డి భరద్వాజ్ తల్లి కృష్ణవేణి మృతి (Twiter/Photo)
  • Share this:
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ద‌ర్శ‌కుడు, నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ మాతృమూర్తి కృష్ణ‌వేణి సోమ‌వారం మృతి చెందారు. ఆమె వయసు 94 సంవత్సరాలు. ఆమె గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. త‌మ్మారెడ్డి భ‌రద్వాజ తండ్రి కృష్ణ‌మూర్తి కూడా చిత్ర నిర్మాత మరియు దర్శకుడు. ఆయ‌న ర‌వీంద్ర ఆర్ట్స్ ప‌తాకంపై ల‌క్షాధికారి, జ‌మీందారు, బంగారు గాజులు, ధ‌ర్మ‌ధాత‌, ద‌త్త పుత్రుడు, డాక్ట‌ర్ బాబు త‌దిత‌ర అనేక విజ‌య‌వంత‌మైన చిత్రాలు నిర్మించారు. ఈ దంపతుల‌కు ఇద్ద‌రు కుమారులు. పెద్ద కుమారుడు లెనిన్ బాబు కూడా చ‌నిపోయారు. ఈయన కూడా పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. చిన్న కుమారుడు భ‌రద్వాజ నిర్మాత‌గా, ద‌ర్శ‌కుడిగా అనేక విజ‌య‌వంతమైన చిత్రాలు అందించారు. మొద‌టి నుంచి వీరిది వామ‌ప‌క్ష భావాజాల కుటుంబం. ఈయన చిరంజీవి తొలినాళ్లలో ‘కోతలరాయుడు’ వంటి పలు చిత్రాలను నిర్మించారు. తల్లి మృతిపై తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ..  అనారోగ్యంతో త‌న త‌ల్లి రెండు నెల‌లుగా ఇబ్బంది ప‌డుతున్నార‌ని తెలిపారు.

tollywood director and producer tammareddy bharadwaja mother krishnaveni passes away,tammareddy bharadwaja, tammareddy bharadwaja mother passes away, tammareddy bharadwaja mother krishnaveni passes away,tollywood director and producer tammareddy bharadwaja, tammareddy bharadwaja chiranjeevi condolence to tammareddy bharadwaja mother krishnaveni demice,chiranjeevi twitter,chiranjeevi instagram, tammareddy bharadwaja twitter, tammareddy bharadwaja instagram,tollywood,telugu cinema,తమ్మారెడ్డి భరద్వాజ,తమ్మారెడ్డి భదర్వాజకు మాతృ వియోగం,తమ్మారెడ్డి భరద్వాజ తల్లి కృష్ణవేణి మృతి,తమ్మారెడ్డి భరద్వాజకు చిరంజీవి పరామర్శ,చిరంజీవి తమ్మారెడ్డి భరద్వాజ
తమ్మారెడ్డి భరద్వాజ్ తల్లి కృష్ణవేణి మృతి (Twiter/Photo)


త‌న మిత్రులు, శ్రేయోభిలాషులు చాలా మంది ఫోన్లు చేస్తున్నార‌న్నారు. క‌రోనా తీవ్ర‌త ఎక్కువ‌గా ఉన్నందున త‌న‌ను ప‌రామ‌ర్శించ‌డానికి ఎవ‌రూ ఇంటికి రావ‌ద్ద‌ని ఆయ‌న కోరారు. ఇక తమ్మారెడ్డి భరద్వాజ్ మృతిపై ప్రముఖ నటుడు చిరంజీవి తమ్మారెడ్డికి ఫోన్‌లో పరామర్శించారు.
First published: April 6, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading