మరో సినిమాకు విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్.. ఎవరితో చేస్తున్నాడో తెలుసా?

Vijay Devarakonda new movie : విజయ్ చివరి చిత్రం డియర్ కామ్రేడ్ బోల్తా కొట్టడంతో..ఆచీ తూచీ సినిమాలను ఎంచుకుంటున్నాడు. వరుసపెట్టి సినిమాలు చేయడం కాకుండా.. కాస్త గ్యాప్ తీసుకుని మంచి సినిమాలే చేయాలనుకుంటున్నాడు.

news18-telugu
Updated: November 1, 2019, 10:47 AM IST
మరో సినిమాకు విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్.. ఎవరితో చేస్తున్నాడో తెలుసా?
విజయ్ దేవరకొండ Photo: Instagram.com/thedeverakonda/
  • Share this:
టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నిన్ను కోరి, మజిలీ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు శివ నిర్వాణతో సినిమాకు ఓకె చెప్పారు. ఇటీవల శివ నిర్వాణ వినిపించిన కథ విజయ్‌కు నచ్చినట్టు తెలుస్తోంది. పూర్తి స్క్రిప్ట్ వర్క్‌తో రావాలని విజయ్ శివను కోరినట్టు సమాచారం.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో 'ఫైటర్' చిత్రంలో నటించనున్నాడు. విజయ్ చివరి చిత్రం డియర్ కామ్రేడ్ బోల్తా కొట్టడంతో..ఆచీ తూచీ సినిమాలను ఎంచుకుంటున్నాడు. వరుసపెట్టి సినిమాలు చేయడం కాకుండా.. కాస్త గ్యాప్ తీసుకుని మంచి సినిమాలే చేయాలనుకుంటున్నాడు. శివ నిర్వాణ చెప్పిన కథ విభిన్నంగా అనిపించడంతో.. అతనితో సినిమాకు ఓకె చెప్పినట్టు తెలుస్తోంది.
Published by: Srinivas Mittapalli
First published: November 1, 2019, 10:46 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading