TOLLYWOOD CRAZY HERO SATYADEV GODSE MOVIE RELEASE ON JUNE 17TH HERE ARE THE DETAILS TA
Satyadev - Godse : విలక్షణ నటుడు సత్యదేవ్ ‘గాడ్సే’ విడుదల తేది ఖరారు..
సత్యదేవ్ ‘గాడ్సే’ మూవీ విడుదల తేది ఖరారు (Twitter/Photo)
Satyadev - Godse : తెలుగులో భిన్న కథలతో పాటు సరికొత్త పాత్రలతో ఆకట్టుకుంటున్న నటుడు సత్యదేవ్. కేవలం హీరోగానే కాకుండా కారెక్టర్ ఆర్టిస్టుగా కూడా ఈయనకు మంచి క్రేజ్ ఉంది. తాజాగా ఈయన హీరోగా నటించిన సినిమా విడుదల తేది ఖరారైంది.
Satyadev - Godse : తెలుగులో భిన్న కథలతో పాటు సరికొత్త పాత్రలతో ఆకట్టుకుంటున్న నటుడు సత్యదేవ్. కేవలం హీరోగానే కాకుండా కారెక్టర్ ఆర్టిస్టుగా కూడా ఈయనకు మంచి క్రేజ్ ఉంది. చిన్న స్థాయి నుంచి ఇప్పుడు మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు సత్యదేవ్. ఇప్పటికే ‘47 రోజులు’, ఆ తర్వాత ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమాలతో ఓటీటీలో పలకరించాడు. ఈ సినిమాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్నాడు సత్యదేవ్. ఆ తర్వాత ఈయన ‘తిమ్మరుసు, గుర్తుందా శీతాకాలం, స్కైలాబ్ వంటి డిఫరెంట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. కేవలం హీరోగానే కాకుండా.. వేరే హీరో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూ మెప్పిస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో పాటు తాజాగా ఆచార్యలో కూడా ఈయన తళుక్కున మెరిసారు.
మరోవైపు హిందీలో అక్షయ్ కుమార్‌తో కలిసి ‘రామ్ సేతు’ సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా షూటింగ్ రీసెంట్గా కంప్లీటైంది. మరోవైపు చిరంజీవి.. ‘గాడ్ ఫాదర్’మూవీలో నయనతార మొగుడు పాత్రలో కథను మలుపు తిప్పే పాత్రలో నటిస్తున్నారు.
తాజాగా ఈయన ముఖ్యపాత్రలో నటించిన మూవీ ‘గాడ్సే’. గోపీ గణేష్ పట్టాభి ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమాకు ‘గాడ్సే’ టైటిల్ పెట్టడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. అసలు ఈ సినిమాకు గాడ్సే పేరు ఎందుకు పెట్టారు. అసలు కథేంటి అనేది ఈ సినిమాపై ఆసక్తి రేకిత్తి స్తోంది. ఈ సినిమాను జూన్ 17న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. మరి ఈ సినిమాతో సత్యదేవ్ మరో సక్సెస్ అందుకుంటారా అనేది చూడాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.