Kathi Mahesh: రోడ్డు ప్రమాదంలో కత్తి మహేష్‌కు గాయాలు.. నుజ్జు నుజ్జయినా కారు!

kathi mahesh

Kathi Mahesh: తెలుగు చలన చిత్ర రంగానికి చెందిన నటుడు కత్తి మహేష్. ఈయన పరిచయం గురించి తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిందే. మొదట్లో షార్ట్ ఫిలిమ్ కి దర్శకత్వం వహించిన కత్తి మహేష్ ఆ తర్వాత వెండితెరపై ఓ సినిమాలో సహాయ రచయితగా పని చేశాడు.

  • Share this:
    Kathi Mahesh: తెలుగు చలన చిత్ర రంగానికి చెందిన నటుడు కత్తి మహేష్. ఈయన పరిచయం గురించి తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిందే. మొదట్లో షార్ట్ ఫిలిమ్ కి దర్శకత్వం వహించిన కత్తి మహేష్ ఆ తర్వాత వెండితెరపై ఓ సినిమాలో సహాయ రచయితగా పని చేశాడు. ఇక ఈయన సినీ నటుల పట్ల ఎప్పుడు విమర్శలు చేస్తూనే ఉంటాడు. ఇప్పటికే ఎంతోమంది నటులను తన నోటికొచ్చినట్లు విమర్శలు చేశాడు. ఇదిలా ఉంటే తాజాగా కత్తి మహేష్ కు రోడ్డు ప్రమాదం జరిగింది.

    నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద కత్తి మహేష్ ప్రయాణిస్తున్న కారును ఓ లారీ ఢీ కొట్టింది. ఇక ఈ ప్రమాదంలో కత్తి మహేష్ కు పెను ప్రమాదం తప్పగా ఆయనకు కొన్ని స్వల్ప గాయాలయ్యాయి. ఇక వెంటనే నెల్లూరులోని సమీపంలో మెడికేర్ హాస్పిటల్ కి తరలించారు. ఇక ఈ ప్రమాదంలో ఆయన కారు నుజ్జు నుజ్జు అయ్యింది. ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే విషయం పై పోలీసులు దర్యాప్తు చేయగా ఈ ప్రమాదం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆయనకు ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

    ఇదిలా ఉంటే ఇటీవలే అయినా బన్నీ వాసు పై విరుచుకు పడ్డ సంగతి తెలిసిందే. తనపై లైంగిక ఆరోపణలు బన్నీవాసు చేయించాడని తెగ విరుచుకుపడ్డాడు. అంతేకాకుండా జీవిత రాజశేఖర్ లపై కూడా దాడి చేయించింది బన్నీ వాసు నేనని తెలిపాడు. ఇక సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటే కత్తి మహేష్ నిత్యం ఏదో ఒక పోస్టు తో హాట్ టాపిక్ గా మారుస్తాడు. అంతే కాకుండా టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ పట్ల కూడా ఎన్నో విమర్శలు చేశాడు. అంతే కాకుండా ఆయన వ్యక్తిగత విషయాలను కూడా చాలా సార్లు మీడియా ముందు బయట పెట్టిన సంగతి తెలిసిందే. ఇలా చాలావరకు విమర్శలతోనే బాగా ఫేమస్ గా మారాడు కత్తి మహేష్.
    Published by:Navya Reddy
    First published: