TOLLYWOOD CONTROVERSY ACTRESS POONAM KAUR INTERESTING POST ON VAKEEL SAAB MOVIE IN TWITTER PK
Vakeel Saab - Poonam Kaur: ‘వకీల్ సాబ్’ సినిమాపై పూనమ్ కౌర్ సంచలనం.. ఇప్పుడు పెట్టండి ప్రెస్ మీట్..
పూనమ్ కౌర్ (Source: Twitter)
Vakeel Saab - Poonam Kaur: సినిమాను సినిమాలా తీసుకోకుండా రాజకీయ కుట్ర చేస్తున్నారంటూ ఆమె ఫైర్ అయిపోయింది. ఏపీలో వకీల్ సాబ్ సినిమాపై కొన్ని వివాదాలు నడుస్తున్నాయి. తాజాగా ఈ చిత్రంపై టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ కూడా ఆసక్తికరమైన పోస్టులు చేసింది.
అజ్ఞాతవాసి తర్వాత మూడేళ్ళ గ్యాప్ తీసుకుని ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన సినిమా వకీల్ సాబ్. ఇందులో జనసేన ప్రచారం కూడా బాగానే చేసారు. దానికితోడు ఆయన ఇమేజ్‌కు తగ్గట్లు కామెడీ, రొమాన్స్ జోలికి వెళ్లకుండా సందేశాత్మక కథను తీసుకొచ్చారు. వకీల్ సాబ్ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో పండగ చేసుకుంటున్నారు అభిమానులు. అయితే ఈ సినిమాపై కొందరు కుట్ర చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మండి పడుతున్నారు. ముఖ్యంగా హీరోయిన్ పూనమ్ కౌర్ ఈ చిత్రంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తి రేపుతున్నాయి. వకీల్ సాబ్ దూకుడును రాజకీయ పలుకుబడితో అడ్డుకోవాలని కొందరు ప్రయత్నిస్తున్నారంటూ ఈమె మండిపడింది. సినిమాను సినిమాలా తీసుకోకుండా రాజకీయ కుట్ర చేస్తున్నారంటూ ఆమె ఫైర్ అయిపోయింది. ఏపీలో వకీల్ సాబ్ సినిమాపై కొన్ని వివాదాలు నడుస్తున్నాయి. అక్కడ టికెట్ రేట్స్‌పై చాలా రచ్చ జరుగుతుంది. కోర్టు కూడా పవన్ సినిమాకు అనుకూలంగానే తీర్పు ఇచ్చినా.. దీనిపై కూడా కౌంటర్ దాఖలు చేసింది ప్రభుత్వం. ఇదిలా ఉంటే ఇప్పుడు పూనమ్ కౌర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
మంచి కంటెంట్ ఉన్న సినిమాను ఎవరైనా చూసినా ఎంకరేజ్ చేయాలి కానీ.. పక్కా ప్లానింగ్ ప్కరారం డీ ఫేమ్ చేయడం ఏంటో..? ఇప్పుడు ఎవరు చేస్తున్నారు కుళ్లు రాజకీయాలు..? అమ్మాయిలను డీ ఫేమ్ చేసి రాజకీయం చేస్తే తప్పు కాదు.. అమ్మాయిలను రక్షించే సినిమాలు తీస్తే ప్రాబ్లమ్ ఎవరికి..? ప్రెస్ మీట్ పోసాని గారు..? అంటూ పోస్ట్ చేసింది. కుళ్లు రాజకీయాలు మానేయాలి అంటూ పూనమ్ చేసిన పోస్టులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Ammailu ni defame chesi rajikiyam cheste tappu kadu
Ammail ni rakshinchey cinema teestey problem evariki?
Pressmeet PosaniGaru ?
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) April 9, 2021
ఎవర్ని ఉద్దేశ్యించి ఇలాంటి పోస్టులు పూనమ్ కౌర్ పెట్టిందబ్బా అంటూ నెటిజన్లు కూడా కామెంట్ చేస్తున్నారు. అప్పట్లో పవన్, పూనమ్ మధ్య ఏదో ఉందంటూ చాలా మంది చాలా విధాలుగా రచ్చ చేసారు. ఈ విషయంలో దర్శకుడు త్రివిక్రమ్ పేరు కూడా మధ్యలోకి తీసుకొచ్చారు.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.