Pawan Kalyan 30 years Prudhvi: పవన్ కళ్యాణ్ స్థాయేంటి.. నా స్థాయేంటి.. 30 ఇయర్స్ పృథ్వీ ఆసక్తికర వ్యాఖ్యలు..

30 ఇయర్స్ పృథ్వీ రాజ్ పవన్ కళ్యాణ్ (30 years prudhvi pawan kalyan)

Pawan Kalyan 30 years Prudhvi: ఒకప్పుడు కమెడియన్ కమ్ పొలిటికల్ లీడర్ 30 ఇయర్స్ పృథ్వీ పేరు ఎక్కువగా వినిపించేది. మూడేళ్ల కింది వరకు కూడా వరస సినిమాలతో బిజీగా ఉన్న ఈయనకు ఇప్పుడు టైమ్ అస్సలు కలిసిరావడం లేదు. పర్సనల్‌గా.. ప్రొఫెషనల్‌గా..

  • Share this:
ఒకప్పుడు కమెడియన్ కమ్ పొలిటికల్ లీడర్ 30 ఇయర్స్ పృథ్వీ పేరు ఎక్కువగా వినిపించేది. మూడేళ్ల కింది వరకు కూడా వరస సినిమాలతో బిజీగా ఉన్న ఈయనకు ఇప్పుడు టైమ్ అస్సలు కలిసిరావడం లేదు. పర్సనల్‌గా.. ప్రొఫెషనల్‌గా.. పొలిటికల్‌గా మూడు చోట్ల కూడా ఈయన దెబ్బ తింటున్నాడు. ఆరోగ్యం దెబ్బతింటుంది.. అలాగే సినిమాలు రావడం లేదు.. మరోవైపు రాజకీయాల్లో కూడా ఉన్న పదవి కాస్తా ఊడిపోయింది. వైసీపీలో కీలకంగా ఉన్న ఈయనకు ఆ మధ్య ఎస్విబిసి చైర్మన్ పదవిని కట్టబెట్టారు. అయితే అక్కడ ఏదో తేడాలు జరిగి ఈయన పదవి కాస్తా పోయింది. కావాలనే కొందరు కుట్ర చేసి తన పదవి పోగొట్టారని చెప్పుకొచ్చాడు పృథ్వీ. ప్రభుత్వమే ఆయన చేత రాజీనామా చేయించిందని కొందరు అనే వాళ్లు లేకపోలేరు. ఇవన్నీ పక్కనబెడితే పృథ్వీ రాజ్ గురించి ఇప్పుడు మరిన్ని విషయాలు కూడా బయటికి వస్తున్నాయి. ముఖ్యంగా ఈయన పవన్ కళ్యాణ్‌పై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు. ఎన్నికల సమయంలో మెగా ఫ్యామిలీని బాగానే టార్గెట్ చేసాడు పృథ్వీరాజ్. అంతేకాదు జనసేనకు నాగబాబు ఇచ్చిన కోటి ఎక్కడి నుంచి వచ్చాయో మాకు తెలుసు అంటూ అప్పట్లో పృథ్వీ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి.

pawan kalyan,30 years prudhvi raj,30 years prudhvi pawan kalyan,30 years prudhvi comments on pawan kalyan,30 years prudhvi pawan kalyan political,30 years prudhvi pawan kalyan janasena YCP,telugu cinema,30 years prudhvi pawan kalyan nagababu,30 years prudhvi pawan kalyan Chiranjeevi,చిరంజీవి,నాగబాబు,పవన్ కళ్యాణ్,30 ఇయర్స్ పృథ్వీరాజ్,తెలుగు సినిమా
30 ఇయర్స్ పృథ్వీ రాజ్ పవన్ కళ్యాణ్ (30 years prudhvi pawan kalyan)


అప్పట్లో ఈయన్ని పవన్ అభిమానులు దారుణంగా టార్గెట్ చేసారు. ఈ దెబ్బకు తగ్గి తనకు మెగా కుటుంబానికి ఎలాంటి శత్రుత్వం లేదని చెప్పాడు కూడా. ఇప్పుడు మరోసారి పవన్ కళ్యాణ్ గురించి కామెంట్ చేసాడు ఈయన. పవన్ చాలా మంచి వ్యక్తి అని.. ఆయనను విమర్శించే స్థాయి తనకు లేదని చెబుతున్నాడు ఈ కమెడియన్. తాను ఇండస్ట్రీకి రావడానికి కారణమే మెగాస్టార్ మీద ఉన్న ఆసక్తి అని.. ఆయనను రోల్ మోడల్‌గా తీసుకుని తాను ఇండస్ట్రీకి వచ్చానని ఇప్పుడు ఇచ్చిన ఇంటర్వ్యూలలో చెప్తున్నాడు. అన్నయ్యే తనకు అన్నీ అంటున్నాడు ఈయన. అలాంటి కుటుంబాన్ని తానెప్పుడూ విమర్శించనంటున్నాడు ఈయన.

pawan kalyan,30 years prudhvi raj,30 years prudhvi pawan kalyan,30 years prudhvi comments on pawan kalyan,30 years prudhvi pawan kalyan political,30 years prudhvi pawan kalyan janasena YCP,telugu cinema,30 years prudhvi pawan kalyan nagababu,30 years prudhvi pawan kalyan Chiranjeevi,చిరంజీవి,నాగబాబు,పవన్ కళ్యాణ్,30 ఇయర్స్ పృథ్వీరాజ్,తెలుగు సినిమా
చిరంజీవి పృథ్వీ


రాజకీయంగా 100 మాటలు అంటాం గానీ సినిమా పరంగా మెగా ఫ్యామిలీ తనకు చాలా సాయపడింది అంటున్నాడు పృథ్వీరాజ్. తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక పార్టీ పదవి అనుభవించాను కాబట్టి విమర్శలు చేయాల్సి వచ్చిందని.. లేకపోతే పవన్‌కి గాని నాగబాబుకి కానీ తనకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పుకొచ్చాడు ఈ కమెడియన్. ఉన్నఫలంగా ఇలా పృథ్వీ ప్లేట్ తిప్పడానికి కారణం అవకాశాలు లేకుండా పోవడమే అని తెలుస్తుంది. మెగా కుటుంబంతో సున్నం పెట్టుకున్న కారణంగానే ఈయన్ని ఆ ఫ్యామిలీ హీరోలు ఎవరూ తీసుకోవడం లేదు. కొన్ని సినిమాల్లో మంచి పాత్రలు పడినా కూడా దర్శక నిర్మాతలు తొలిగించినట్లు తెలుస్తుంది. అందుకే కెరీర్ కోసం మెగా భజన తప్పడం లేదు ఈయనకు.
Published by:Praveen Kumar Vadla
First published: