ఈ రోజుల్లో మీడియా మరీ దారుణంగా మారిపోయిందనీ.. పేజ్ వ్యూస్, టీఆర్పీ రేటింగ్ ఒక్కటే పరమావధి అన్నట్లుగా వాళ్ల తీరు మారిపోతుందనే విమర్శలు చాలా రోజులుగా వస్తూనే ఉన్నాయి. వాటిని కొందరు ఎప్పటికప్పుడు నిజమే.. మేము ఇలాగే ఉంటామంటూ నిరూపిస్తున్నారు కూడా. ముఖ్యంగా యూ ట్యూబ్ ఛానెల్స్ తీరు రోజురోజుకీ దిగజారిపోతుంది. ఏం చేసైనా సరే.. వాళ్లకు క్లిక్స్ వస్తే చాలు అనుకుంటున్నారు వాళ్లు. అందుకే ఎంతకు దిగజారడానికైనా సిద్ధమే అంటున్నారు. దానికోసం నైతిక విలువలను కూడా తుంగలో తొక్కేస్తున్నారు.
ఇప్పుడు కూడా ఇదే జరిగింది. ప్రముఖ తెలుగు నటుడు సునీల్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడంటూ ఓ యూ ట్యూబ్ ఛానెల్ ప్రసారం చేసింది. అది ఇటూ అటూ తిరిగి చివరికి ఇండస్ట్రీలో వేగంగా వ్యాపించింది. అదేంటి.. సునీల్ చనిపోవడం ఏంటి.. అతడికి యాక్సిడెంట్ కావడం ఏంటి అంటూ అంతా కంగారు పడ్డారు. తీరా అసలు విషయం తెలిసి.. అలా రాసిన వాళ్లను.. ఛానెల్ తీరును చూసి బండ బూతులు తిట్టుకుంటున్నారు అభిమానులు. ఇంతకీ విషయం ఏంటంటే.. పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లాలో ఓ రోడ్డు ప్రమాదం జరిగింది.
Don't believe it, It's a fake news I'm absolutely fine and please don't trust these articles. pic.twitter.com/pdU9hDVEEY
— Sunil (@Mee_Sunil) March 15, 2019
అందులో తెలుగు ఇండస్ట్రీ బుల్లితెర నటుడు నందం సునీల్ మరణించాడు. దాన్ని తమ లాభం కోసం కొందరు ఇష్టమొచ్చినట్లు రాసేసి యూ ట్యూబ్ ఛానెల్లో ప్రమోట్ చేసుకున్నారు. ప్రముఖ టాలీవుడ్ నటుడు సునీల్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు అంటూ రాసేసరికి అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అసలు విషయం తెలుసుకుని సునీల్ కూడా వెంటనే తన ట్విట్టర్లో మ్యాటర్ షేర్ చేసి.. ఇలాంటి అబద్ధపు వార్తలను అస్సలు నమ్మకండి అంటూ ట్వీట్ చేసాడు ఈ నటుడు. ఇలాంటి వార్తలు రాసి.. లేనిపోని భయాలు పుట్టించొద్దంటూ ఆయన మీడియాను కోరుకున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Sunil, Telugu Cinema, Tollywood, Youtube