• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • TOLLYWOOD COMEDIAN PRUDVI RAJ HOT COMMENTS ON LATE REAL STAR SRIHARI IN SUMA CASH PROGRAM NR

Srihari - Prudhvi Raj: డబ్బులు రోడ్డు మీదకు విసిరేవారు అంటూ శ్రీహరిపై పృద్విరాజ్ షాకింగ్ కామెంట్స్!

శ్రీహరి, పృద్విరాజ్ (ఫైల్)

Srihari - Prudhvi Raj: తెలుగు సినీ నటుడు శ్రీహరి. ఇండస్ట్రీలో మంచి నటుడిగా పేరు సంపాదించుకున్న ఈయన హీరోగానే కాకుండా విలన్ పాత్రలలో, సహాయ పాత్రలలో బాగా మెప్పించాడు. ఎన్నో సినిమాలలో నటించిన ఈయన తన చివరి ఊపిరి వరకు ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉన్నాడు. ఇక ఈయన ఎంతో మంచి వ్యక్తిత్వాన్ని కలిగినవాడని ఈయన తో కలిసి నటించిన నటులు పలు సందర్భాలలో తెలిపారు.

  • Share this:
    తెలుగు సినీ నటుడు శ్రీహరి. ఇండస్ట్రీలో మంచి నటుడిగా పేరు సంపాదించుకున్న ఈయన హీరోగానే కాకుండా విలన్ పాత్రలలో, సహాయ పాత్రలలో బాగా మెప్పించాడు. ఎన్నో సినిమాలలో నటించిన ఈయన తన చివరి ఊపిరి వరకు ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉన్నాడు. ఇక ఈయన ఎంతో మంచి వ్యక్తిత్వాన్ని కలిగినవాడని ఈయన తో కలిసి నటించిన నటులు పలు సందర్భాలలో తెలిపారు. ఈయన మరో సినీ నటి డిస్కో శాంతి ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక వీరికి ఇద్దరు కుమారులు ఒక కూతురు కూడా ఉంది. ఇక శ్రీహరి ప్రజలకు ఎన్నో సేవలు అందించాడు. అంతేకాకుండా నాలుగు ఊర్లను కూడా దత్తత తీసుకున్నాడు. ఆ గ్రామాలకు ఎన్నో సదుపాయాలు కల్పించాడు. ఇక ఈయన మంచి నటుడిగా నిలువగా 2013లో అనారోగ్య సమస్య వల్ల ఈ లోకాన్ని విడిచి వెళ్లారు.

    ఇదిలా ఉంటే తాజాగా ఈయన గురించి మరో నటుడు పృథ్వీ ఓ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ఈటీవీలో ప్రసారమవుతున్న సుమ క్యాష్ షో గురించి అందరికీ తెలిసిందే. ఇక ఈ షో కి సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో తాజాగా విడుదల కాగా అందులో కమెడియన్ పృథ్వీ, బెనర్జీ, జ్యోతి, సుదర్శన్ పాల్గొన్నారు. ఇక ఈ నేపథ్యంలో అందులో శ్రీహరి, ఉదయ్ కిరణ్ గురించి కొన్ని విషయాలు పంచుకోగా.. పృథ్వీ, శ్రీహరి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు.

    ఆయన ఎంత గొప్పవారో అంటూ జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 45 లోని ఆయన ఇంటి ముందు ఎవరైనా వచ్చి నిలుచొని ఉంటే బాల్కనీ నుంచి డబ్బులో రాయిని చుట్టి గుడ్డ కట్టి విసిరే వారట. ఇక ఆ డబ్బును అవతలి వ్యక్తులు తీసుకొని ఆయనకు దండం పెట్టే వారిని, ఆయన కొన్ని వేల గుప్తదానాలు చేశారని తెలిపాడు పృథ్వీ. ఇక ఈ ఎపిసోడ్ వచ్చే శనివారం ప్రసారం కానుంది.
    Published by:Navya Reddy
    First published: