హోమ్ /వార్తలు /సినిమా /

జనసేన వైపు బండ్ల గణేష్.. పవన్ కళ్యాణ్‌ భజన మొదలు..?

జనసేన వైపు బండ్ల గణేష్.. పవన్ కళ్యాణ్‌ భజన మొదలు..?

బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్

బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్

బండ్ల గణేష్ ఈజ్ బ్యాక్.. కొన్ని రోజుల గ్యాప్ తర్వాత మళ్లీ రాజకీయాల వైపు ఆసక్తి చూపిస్తున్నాడు ఈయన. ఇప్పుడు ఉన్నట్లుండి ఈయన మళ్లీ పవన్ కళ్యాణ్‌కు జై అనేసాడు. కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత ఈయన..

బండ్ల గణేష్ ఈజ్ బ్యాక్.. కొన్ని రోజుల గ్యాప్ తర్వాత మళ్లీ రాజకీయాల వైపు ఆసక్తి చూపిస్తున్నాడు ఈయన. ఇప్పుడు ఉన్నట్లుండి ఈయన మళ్లీ పవన్ కళ్యాణ్‌కు జై అనేసాడు. కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత ఈయన పాలిటిక్స్ వైపు చూడటం లేదు. ఆ తర్వాత కూడా కొన్ని రోజులు పూర్తిగా సైలెంట్ అయిపోయాడు. ఇక అంతకుముందు పవన్ కోసం ప్రాణాలిస్తానని చెప్పిన బండ్ల.. ఉన్నట్లుండి సైడ్ అయ్యాడు.. సైలెంట్ అయ్యాడు. జనసేనలో చేరతాడేమో అనుకుంటే వెళ్లి కాంగ్రెస్ బాట పట్టాడు. ఆ తర్వాత కూడా పవన్ గురించి ఒక్కమాట కూడా మాట్లాడలేదు బండ్ల గణేష్.

దానికి ముందు పవన్‌పై ఈయనకున్న అభిమానం గురించి చెప్పడానికి మాటలు సరిపోయేవి కావు.. అందుకే బండ్ల గణేష్ ఎన్ని చేసినా కూడా ఈయనంటే పవన్ అభిమానులకు ఎంతో అభిమానం.. గౌరవం కూడా. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత తెలంగాణలో జనసేనను చూసుకుంటాడనే వార్తలు కూడా వచ్చాయి. కానీ అవేం జరగలేదు. దాంతో పాటు పవన్‌కు దూరంగా ఉండటంతో ఈ ఇద్దరి మధ్య విభేధాలు వచ్చాయనే వార్తలు కూడా వచ్చాయి. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలతో బిజీ కావాలని చూస్తున్నాడు బండ్ల గణేష్. ఈ మధ్యే సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు.

ఇదిలా ఉంటే చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గురించి మళ్లీ ట్వీట్ చేసాడు బండ్ల గణేష్. ఈయన తన ట్విట్టర్‌లో పవన్ ఫోటో ఒకటి ట్వీట్ చేసాడు. నేను భయంతో రాలేదు.. బాధ్యతతో వచ్చాను అని పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్‌లో ఓ పోస్టర్ పోస్ట్ చేసాడు. ఇది నిజం అంటూ బండ్ల గణేష్ ఆ ఫోటోను షేర్ చేయడంతో ఆసక్తి మొదలైంది. చాలా రోజుల తర్వాత మళ్లీ పవన్ మెప్పు కోసం బయల్దేరాడు బండ్ల గణేష్. పవన్ కూడా సినిమాలు చేస్తున్నాడు కాబట్టి తన బ్యానర్‌లో సినిమా కోసమే బండ్ల ఇలా భజన మొదలుపెట్టాడని కొందరంటుంటే.. అలాంటి అవసరం ఆయనకు లేదని మరికొందరు బండ్ల గణేష్‌కు సపోర్ట్ చేస్తున్నారు. ఏదేమైనా కూడా బండ్ల మళ్లీ పవన్ భజన మాత్రం మొదలుపెట్టాడు.

First published:

Tags: Bandla Ganesh, Pawan kalyan, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు