Home /News /movies /

TOLLYWOOD COMEDIAN ALI HONORED WITH HASYA NATARATNA AWARD NR

Comedian Ali: కమెడియన్ అలీకి అరుదైన గౌరవం.. 'హాస్య నటరత్న'గా పురస్కారం

Comedian Ali

Comedian Ali

Comedian Ali: తెలుగు సినీ హాస్యనటుడు అలీ గురించి అందరికీ తెలిసిందే. తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకొని మంచి అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.

    Comedian Ali: తెలుగు సినీ హాస్యనటుడు అలీ గురించి అందరికీ తెలిసిందే. తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకొని మంచి అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. సినీ ఇండస్ట్రీకి బాలనటుడిగా పరిచయమై ఆ తర్వాత హీరోగా, కమెడియన్ గా నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు. నటుడిగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా అలీ ఎంతో మందికి సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు. ఇదిలా ఉంటే తాజాగా హాస్య నటరత్న పురస్కారం అందుకున్నాడు.

    1981లో సీతాకోకచిలుక సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఆ తర్వాత రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు, యమలీల వంటి ఎన్నో సినిమాలలో నటించి స్టార్ కమెడియన్ గా నిలిచాడు. దాదాపు 1100 పైగా సినిమాలలో నటించాడు అలీ. ఇక ఈయన బుల్లితెరపై కూడా పలు షో లలో హోస్టింగ్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈటీవీలో ప్రసారం అవుతున్న ఆలీతో సరదాగా అనే రియాలిటీ షో లో సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలను ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఇక అలీ ఒక నటుడిగానే కాకుండా వ్యక్తిగతంగా కొన్ని బాధ్యతలు కూడా చేపట్టాడు.

    ఇది కూడా చదవండి:సరయు దెబ్బకు బెదిరిపోయిన అరియనా.. ఇంటర్వ్యూలో గుట్టు అంత విప్పేసిందిగా

    తన తండ్రి పేరు మీద మహమ్మద్ భాష చారిటబుల్ ట్రస్ట్ అనే పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నాడు. అందులో పేదలకు సేవ చేస్తూ మంచి మనసున్న నటుడిగా పేదల గుండెల్లో నిలిచాడు. ఇదిలా ఉంటే ఈయనకు గతంలో గౌరవ డాక్టరేట్ ను కూడా ప్రకటించారు. కొన్ని పురస్కారాలు కూడా అందుకున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా హైదరాబాద్ రవీంద్రభారతిలో ఇతర రంగాలలో పలు సేవలు అందిస్తున్న మానవ మూర్తులందరికి.. 'ఇన్సానియత్ కి బిద్యత్ సొసైటీ' ఆధ్వర్యంలో వరల్డ్ హ్యుమానిటీ కమిషన్ హెడ్ క్వార్టర్స్ సహకారంలో పలు పురస్కారాలు అందించారు.

    ఇది కూడా చదవండి:సరయు మాటల వెనుక బిగ్ బాస్ స్క్రిప్ట్.. షన్నుని ఫోకస్ చేసేందుకే ఇదంతా?

    అందులో సినీనటుడు అలీ కూడా 'హాస్య నటరత్న' పురస్కారం అందుకున్నాడు. ఆయనకు పురస్కారాన్ని అందించి సత్కరించారు. అలీ మాట్లాడుతూ.. తను 1122 సినిమాలలో నటించానని తెలిపాడు. అంతేకాకుండా 500కు పైగా దేశవిదేశాల్లో సత్కారాలతో పాటు పలు అవార్డులను కూడా సొంతం చేసుకున్నట్లు తెలిపాడు. తన సంపాదనలో ఎంతో కొంత అయినా ఆపదలో ఉన్న వారి కోసం ఖర్చు చేస్తే జీవితం కొంత సార్థకమవుతుంది అని తెలిపాడు అలీ. ఇక సాయం చేయడానికి డబ్బే ముఖ్యం కాదు అంటూ మంచి మనసున్న కూడా చాలు అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. తనకు ఈ పురస్కారం అందినందుకు సంతోషం అని తెలిపాడు. ఇక ఈ పురస్కారం అందించిన వారికి కృతజ్ఞతలు తెలిపాడు అలీ.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Comedian ali, Hasya nataratna award, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు