Comedian Ali Home Tour: వామ్మో అలీ ఇంటిని చూస్తే దిమ్మ తిరిగిపోద్ది... అచ్చం ఇంద్ర భవనాన్ని తలపిస్తోందిగా

Comedian Ali Home Tour

Comedian Ali Home Tour: ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ఎంతో అభివృద్ధి చెందటం వల్ల ప్రతి ఒక్కరు సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలు తమ వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు మరింత చేరువ అవుతున్నారు. ఈ క్రమంలోనే చాలామంది సెలబ్రిటీలు తమ పేరిట యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఆ ఛానల్ ద్వారా తమకు సంబంధించిన విషయాలన్నింటినీ అభిమానులతో పంచుకుంటున్నారు.

  • Share this:
    Comedian Ali Home Tour: ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ఎంతో అభివృద్ధి చెందటం వల్ల ప్రతి ఒక్కరు సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలు తమ వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు మరింత చేరువ అవుతున్నారు. ఈ క్రమంలోనే చాలామంది సెలబ్రిటీలు తమ పేరిట యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఆ ఛానల్ ద్వారా తమకు సంబంధించిన విషయాలన్నింటినీ అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే చాలామంది సెలబ్రిటీలు తమ యూట్యూబ్ ఛానల్ ద్వారా హోమ్ టూర్ చేయడం ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయింది. ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు హోమ్ టూర్లను మనం చూసాం. అయితే సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని ఎన్నో వందల సినిమాల్లో నటించిన కమెడియన్ అలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

    సినిమాలలో ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకున్న అలీ భార్య జుబేదా కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా వారి హోమ్ టూర్ చేశారు. ప్రస్తుతం ఈ హోమ్ టూర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే అలీ హోమ్ టూర్ చూస్తే మాత్రం కళ్ళు తిరగడం ఖాయం. ఎంతో విలాసవంతమైన గదులతో మూడంతస్థుల భవనం అచ్చం ఇంద్ర భవనాని తలపిస్తుందని చెప్పవచ్చు.

    ఇది కూడా చదవండి:కమెడియన్ అలీకి అరుదైన గౌరవం.. 'హాస్య నటరత్న'గా పురస్కారం

    ఈ హోమ్ టూర్ లో భాగంగా అలీ భార్య జుబేదా తన ఇంటిని ఎంతో క్షుణ్ణంగా చూపించారు. వారు కిచెన్ తన పిల్లల బెడ్ రూమ్స్, వారి బెడ్ రూమ్, తన శారీ కలెక్షన్స్, ఇలా అన్ని ప్రేక్షకుల కోసం తన హోమ్ టూర్ లో చూపించారు. అదే విధంగా ప్రతి రోజూ వారు చేసే యోగ స్థలం ఇండోర్ గేమ్ హాల్, జిమ్ అన్ని ఈ వీడియోలో చూపించారు.

    ఇది కూడా చదవండి: కోర్టులో తేల్చుకుంటా.. విడాకుల వివాదంపై సమంత సంచలన వ్యాఖ్యలు

    అలాగే అలీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న జిమ్ సెంటర్, తన కార్లను,తన ఇంటిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయించుకున్న హోమ్ థియేటర్స్ అన్నీ ఎంతో చక్కగా అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా హాల్ లో అలీ ఎంతో మంది సెలబ్రిటీలతో దిగిన ఫోటోలను తనకు ఇండస్ట్రీలో వచ్చిన అవార్డులు అన్నింటిని ఎంతో అందంగా అలంకరించుకున్నారు. ఈ హోమ్ టూర్ లో భాగంగా అలీ భార్య జుబేదా అవార్డులన్నింటిని చూపించారు. ఏదిఏమైనప్పటికీ అలీ ఇల్లు చూస్తే మాత్రం నిజంగానే ఇంద్రభవనంలా అనిపిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం అలీ ఇంద్రభవనం మీరు చూసేయండి.
    Published by:Navya Reddy
    First published: