Comedian Ali: కన్నతండ్రిని భయపెట్టిన కమెడియన్ అలీ.. ఎందుకో తెలుసా..?

Comedian Ali: కమెడియన్ అలీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. దాదాపు 40 ఏళ్లుగా 1000కి పైగా సినిమాలు చేసాడు ఈయన. ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు. దానికితోడు రియాలిటీ షోలతో బిజీగా ఉంటాడు ఈయన.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 25, 2020, 4:28 PM IST
Comedian Ali: కన్నతండ్రిని భయపెట్టిన కమెడియన్ అలీ.. ఎందుకో తెలుసా..?
కమెడియన్ అలీ (Comedian Ali)
  • Share this:
కమెడియన్ అలీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. దాదాపు 40 ఏళ్లుగా 1000కి పైగా సినిమాలు చేసాడు ఈయన. ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు. దానికితోడు రియాలిటీ షోలతో బిజీగా ఉంటాడు ఈయన. తనకంటూ ప్రత్యేకమైన శైలిని సంపాదించుకున్న అలీ అంటే చాలా మంది గౌరవిస్తారు కూడా. ఎందుకంటే నటుడిగానే కాకుండా మానవతావాదిగా అలీకి మంచి పేరు ఉంది. ఇక తల్లిదండ్రులను కూడా దేవుళ్లుగా కొలుస్తుంటాడు ఈయన. అలాంటి అలీని చూసి ఒకానొక సమయంలో ఆయన తండ్రి భయపడ్డాడు. ఏరా ఒరేయ్ అని కాకుండా అండీ.. చెప్పండి.. గారు అంటూ సంభోదించేవాడు.
కమెడియన్ అలీ (Comedian Ali)
కమెడియన్ అలీ (Comedian Ali)


దానికి పెద్ద కారణం కూడా ఉంది. దాని వెనక అంతకంటే పెద్ద కథ ఉంది. ఆ సంఘటన గురించి చెప్పుకొచ్చాడు అలీ. తాజాగా ఈయన అలీతో సరదాగా షోకు సీనియర్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి వచ్చాడు. అప్పటి వరకు కమెడియన్‌గా ఉన్న అలీని ఈయనే హీరో చేసాడు. యమలీల సినిమాతో హీరో అయ్యాడు అలీ. ఆ సినిమా ఏడాది పాటు ఆడటంతో అలీకి మంచి అవకాశాలు కూడా వచ్చాయి. అంతేకాదు స్టార్ డమ్ కూడా పెరిగిపోయింది. ఆ వెంటనే దాదాపు 50 సినిమాలకు పైగానే హీరోగా నటించాడు అలీ.
కమెడియన్ అలీ (Comedian Ali)
కమెడియన్ అలీ (Comedian Ali)

ఘటోత్కచుడు లాంటి సినిమాలు ఈయనకు మంచి విజయంతో పాటు మార్కెట్ కూడా తీసుకొచ్చింది. అయితే యమలీల తర్వాత అలీ ఎక్కడికి వెళ్లినా కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చేది. ఆ సమయంలో బయటికి వచ్చినపుడు తన ఇమేజ్ చూసి ఇంట్లో వాళ్లు కూడా భయపడిపోయే వాళ్లని చెప్పాడు అలీ. అప్పటి వరకు ఏరా.. అరేయ్ అని పిలిచిన తన నాన్న కూడా అప్పటి నుంచి గౌరవం ఇవ్వడం మొదలు పెట్టాడని చెప్పాడు అలీ. తనను చూసి భయపడ్డాడని సరదాగా చెప్పుకొచ్చాడు. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డితో పాత సంగతులు గుర్తు చేసుకుంటూ యమలీల తర్వాత తనను ఇంట్లో నాన్న ఏమండి అలీ గారూ.. అని పిలిచేవాడని చెప్పుకొచ్చాడు.

అదేంటి నాన్న అంటే అదంతేనండీ.. మిమ్మల్ని చూస్తుంటే భయమేస్తుందండీ అంటూ ఎంతో వినయంగా చెప్పేవాడని తెలిపాడు అలీ. అది చూసి తనకు నవ్వు వచ్చేదంటున్నాడు అలీ. అయినా కూడా తన నాన్న తర్వాత ఎప్పుడూ తనను అరేయ్, ఏరా, నువ్వు అని పిలవలేదని.. గారూ అని పిలిచేవాడని చెప్పాడు. తన ఇమేజ్ చూసి అలా భయపడిపోయాడు అంటున్నాడు అలీ. యమలీల సినిమా తన జీవితాన్ని అంతగా మార్చేసింది.. తన నాన్నపై అంత ప్రభావం చూపించిందని చెప్పుకొచ్చాడు ఈయన. ఏదేమైనా కూడా కన్నతండ్రే అలా కొడుకును చూసి భయపడే ఇమేజ్ తెచ్చుకున్నాడంటే నిజంగానే అది గర్వకారణం.
Published by: Praveen Kumar Vadla
First published: September 25, 2020, 4:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading